అమరావతి (ప్రజా అమరావతి );
గ్రాడ్యుయేట్స్.. ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి
ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలి. సందర్భంగా ఈ రెండు జిల్లాల్లోని నియోజకవర్గ పార్టీ కార్యకర్తలను పిలిపించి ఓటరు నమోదు కార్యక్రమం గురించి వివరించాం. 30.09.2024 నుంచి 6.11.2024 వరకు కేంద్ర ఎన్నికల కమిషన్ వారి వెబ్ సైట్ లో ఓటు నమోదు చేసుకోవచ్చు. అలాగే ఎమ్మెర్వో కార్యాలయం ద్వారా కూడా ఫారం 18 ధాఖలు చేసి ఓటు నమోదు చేసుకోవచ్చు. ఫారం 18లో పాస్‌పోర్ట్ ఫొటో, గెజిటెడ్ ఆఫీసర్ చే ధృవీకరించిన డిగ్రీ సర్టిఫికెట్ నకలు, ఎపిడ్ కార్డు, ఆధార్ కార్డు కూడా జతపరచాలి. ఓటరుగా నమోదు కావడానికి జూన్ 2021లోపు డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండవలెను. ఈ అర్హతలున్నవారు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పట్టభద్రులందరూ తమ ఓటును నమోదు చేయవల్సిందిగా కోరుతున్నాను.
గమనిక :
10+2+3 పద్ధతిలో డిగ్రీ పాసైన వారు మాత్రమే ఓటరు నమోదుకు అర్హులు. అలాగే ఇంజినీరింగ్, మెడిసిన్, సీఏ ఇతర పీజీ డిప్లొమా పూర్తి చేసిన వారు కూడా ఓటరు నమోదుకు అర్హులు. 10వ తరగతి తరువాత దూరవిద్యలో పూర్తి చేసిన వారు అనర్హులు.
addComments
Post a Comment