ముంపు బారిన పడిన ప్రతి ఒక్కరిని రాష్ట్ర ప్రభుత్వం ఎన్యుమురేషన్ అందించి ఆదుకుంటుంది .



విజయవాడ (ప్రజా అమరావతి),


** విజయవాడ ముంపు ప్రాంతాల్లో పర్యటించి, భోజనం, త్రాగునీరు, పాలు ముంపు బాధితులకు అందిస్తున్న రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రాఫి శాఖ మంత్రి కందుల దుర్గేష్ 


**గత ప్రభుత్వం  ప్రకృతి విపత్తులు గురించి ముందస్తు కార్యాచరణతో ఏమాత్రం పట్టించుకోకపోవడం నేటి పరిస్థితికి  ప్రధాన కారణం 


** గతంలో ఎన్నడు విజయవాడ ఈ రకంగా  ముంపు గురికావడం చూడలేదు.


**  ముంపు బారిన పడిన ప్రతి ఒక్కరిని రాష్ట్ర ప్రభుత్వం ఎన్యుమురేషన్ అందించి  ఆదుకుంటుంది 



.. మంత్రి కందుల దుర్గేష్


గత కొన్ని రోజులుగా  కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా విజయవాడలోని 

లోతట్టు ప్రాంతాలను పరిశీలించి ప్రజలకు ధైర్యం చెప్పడంతో సహాయ పునరావాస  కార్యక్రమాలను వేగవంతం చేస్తూ  ప్రజలకు అండగా వారికి అందుబాటులో ఉంటున్నామని రాష్ట్ర పర్యాటక  సంస్కృతిక సినిమాటోగ్రాఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.


మంగళవారం మంత్రి కందుల దుర్గేష్  స్థానిక నాయకులు, అధికారులతో కలిసి విజయవాడలో ముంపుకు గురైన ప్రాంతాలు  మైత్రి నగర్, జయప్రకాష్ నగర్, సున్నంబట్టీలు క్రీస్తురాజపురం, అరుణ్ నగర్, గంగిరెద్దుల దిబ్బ ప్రదేశాలలోని ప్రజలకు అందిస్తున్న సహాయక చర్యల్లో పాల్గొన్నారు.



గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముంపుకు గురైన   లోతట్టు ప్రాంతాలను  ఇప్పటికే పరిశీలించి ముంపుకు గురైన బాధితులకు  ధైర్యాన్ని చెబుతూ, యుద్ధ ప్రాతిపదికన   ప్రజలకు సహాయ సహకారాలు అందించే విధంగా  ఎన్డీఆర్ఎఫ్ బలగాలు, ప్రభుత్వ యంత్రాంగం  రంగంలోకి దించి సహాయక పునరావాస కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేస్తున్నామన్నారు. ముంపు బారి పడిన  ప్రజలకు ఎటువంటి  ఇబ్బందులకు గురికాకుండా వారికి త్రాగునీరు భోజనం, పాలు  సరఫరా చేసే విధంగా  చర్యలు చేపట్టి, అధికారులను అప్రమత్తం  చేస్తూ  ముంపు నివారణ దిశగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.  బొట్లు, ట్రాక్టర్స్ ద్వారా రిస్కు చేస్తూ  ప్రజలను పునరావస కేంద్రాలకు తరలిస్తున్నామన్నారు. వాటర్ స్థాయి కొద్దికొద్దిగా తగ్గుతుందని  ముంపు ప్రాంతాల్లో ఉన్న వారందరినీ బయటకు తీసుకొచ్చి  పునర్వసు కేంద్రాల్లో ఉంచి  అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు. 


 గత ప్రభుత్వం ఎప్పుడూ ఇటువంటి ప్రకృతి విపత్తులు సంభవించినపుడు ముందస్తు కార్యాచరణతో ఏమాత్రం పట్టించుకోకపోవడం ప్రధాన కారణ మన్నారు. సమర్ధుడైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు  ఎంతో సమర్థవంతంగా అధికారుల అప్రమత్తం చేస్తూ  ఎప్పటికప్పుడు ముంపు  ప్రాంతాలతో తీసుకోవలసిన జాగ్రత్తలపై  అన్ని శాఖలతో కాన్ఫరెన్స్ లు నిర్వహిస్తూ ,  స్వయంగా ముంపు ప్రాంతాలను పరిశీలించి ప్రజలకు ధైర్యం చెబుతున్నారన్నారు. పర్యాటక ప్రాంతాలైన భవాని ఐలాండ్, బెరం పార్క్ వంటివి కూడా ముంపుకు గురయ్యాయ న్నారు. గతంలో ఎన్నడు విజయవాడ ప్రాంతాన్ని ఈ రకంగా  ముంపు గురికావడం చూడలేదన్నారు. భవిష్యత్తులో ఎటువంటి ముంపు ఇతర ప్రకృతి విపత్తులు వచ్చిన వాటిని ఎదుర్కొనే విధంగా  సమగ్ర కార్యాచరణతో  ప్రణాళిక సిద్ధం చేసే విధంగా  రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అమలు చేసే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. వరద ముంపు తగ్గగానే  ముంపు ముగ్గురైన అన్ని ప్రాంతాల్లోని ఇంటింటికి వెళ్లి ఇన్యునరేషన్ చేసి బాధితులకు నష్ట పరిహారం పరిహారాన్ని  అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.


 ఉదయం నుండి మంత్రి కందుల దుర్గేష్  మోకాలు లోతు నీళ్లలో  విజయవాడలో ముంపుకు గురైన అన్ని ప్రాంతాలను  తిరుగుతూ ప్రజల ప్రజలను పరామర్శిస్తూ  అందరికీ భోజనం, త్రాగునీరు, పాలు, ఆరోగ్య విషయంలో మెడిసిన్ వంటి అందిస్తున్నారు.  నిన్న రాత్రి నుంచి ప్రజల్లోనే ఉంటూ వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ  పునరావాస కేంద్రాలకు  తరలిస్తూ అన్ని సహాయ సహకారాలను మంత్రి దగ్గరుండి  చూస్తున్నారు.







Comments