తెనాలి (ప్రజా అమరావతి);
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అస్నా తుఫాను కారణంగా ముంపుకు గురైన డెల్టా ప్రాంతాలైన తెనాలి నియోజకవర్గం వల్లభాపురం నుండి ప్రారంభమై, వేమూరు నియోజకవర్గం, రేపల్లె నియోజకవర్గం వరకు, గుంటూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మందపాటి శేషగిరిరావు తో కలిసి పాల్గొన్న మాజీ మంత్రివర్యులు మేరుగు నాగార్జున , తెనాలి నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ,వేమూరు నియోజకవర్గ ఇన్చార్జి వరికూటి అశోక్ బాబు , రేపల్లె నియోజకవర్గ ఇన్చార్జి ఈపూరి గణేష్ , ఆయా నియోజకవర్గాల రైతులు, వైఎస్సార్సిపి నాయకులు, కార్యకర్తలతో కలిసి ముంపుకు గురైన పొలాలు, పంటలు, ఇళ్లు, కుటుంబాలను పరామర్శించి, నష్ట పోయిన రైతులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని,ప్రభుత్వ పరంగా రావాల్సిన నష్టపరిహారం పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా, తక్షణ సాయం ప్రభుత్వం అందించే వరకు నష్టపోయిన ప్రతిఒక్కరి పక్షాన వైఎస్సార్సిపి పార్టీ పోరాడుతుందని వారికి తెలియ జేస్తూ, సాయంత్రం . రేపల్లె నియోజకవర్గంలో కార్యక్రమం ముగిసింది.
addComments
Post a Comment