*ఆర్టీజీఎస్ సీఈఓ గా బాధ్యతలు స్వీకరించిన కె. దినేష్ కుమార్*
అమరావతి (ప్రజా అమరావతి): రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) ఈసీఓగా ఐఏఎస్ అధికారి కె. దినేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం సచివాలయంలోని ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో ఆయన బాధ్యతలు చేపట్టి ఆర్టీజీఎస్ పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా సేవలు అందించడంలో ఆర్టీజీఎస్ సిబ్బంది పనిచేయాలని తెలిపారు. సాంకేతికతను అందిపుచ్చుకుంటూ పరిష్కార వేదికకు అందిన ఫిర్యాదులను సత్వరం పరిష్కారమయ్యేలా చూడాలని సూచించారు. ఆర్టీజీఎస్ నుంచి ప్రభుత్వం ఆశిస్తున్న స్థాయిలో అత్యుత్తమ సేవలు అందించాలని సూచించారు. ఏపీ ఫైబర్ నెట్ (ఏపీఎస్ ఎఫ్ ఎల్) ఎండీగా ఉన్న దినేష్ కుమార్‌కు ఆర్టీజీఎస్ సీఈఓగా అధనపు బాధ్యతలు అప్పగిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
addComments
Post a Comment