*రాజకీయ లబ్ధి కోసం వెంకటేశ్వర స్వామిని కూడా వదలని సీఎం చంద్రబాబు నాయుడు: మాజీమంత్రి రోజా*
అమరావతి సెప్టెంబర్ 22 (ప్రజా అమరావతి);
తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూ వివాదంపై మాజీ మంత్రి రోజా ఈరోజు మైక్ ల ముందుకు వచ్చారు. ఆమె మైక్ ల ముందు మాట్లాడుతూ..ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై మండిపడ్డారు.
జగన్ అధికారంలో ఉన్న ప్పుడు మోదీ, సీజేఐలు, చంద్రబాబు సైతం కుటుంబాలతో తిరుపతి వెళ్లారని, మరి లడ్డూ రుచిలో తేడా ఉంటే ఆ రోజే ఫిర్యాదు ఎందుకు చేయలేదని నిలదీశారు.
చంద్రబాబు నాయుడు చేస్తున్న ఆరోపణలు సరికాదని, టీటీడీ ఈవో శ్యామల రావు బాధ్యతలు తీసుకున్న వెంటనే స్వచ్ఛమైన నెయ్యిని వాడుతున్నట్లు తెలిపారని అన్నారని గుర్తుచేశారు. వెజిటబుల్ ఆయిల్ మిక్స్ చేశారని, అందుకే నెయ్యిని వెనక్కు పంపామని జులై 23న ఈవో ప్రకటన చేశారని అన్నారు.
రెండు నెలల తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు కొత్త ప్రకటన చేయడం వెనుక ఆంతర్యం ఏంటని నిలదీశారు. టీడీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి నింద వేశారని అన్నారు.
మళ్లీ శ్యామలరావుపై ఒత్తిడి తెచ్చి ప్రెస్ మీట్ పెట్టించారని, గత ప్రభు త్వంలో బయటపడిన అంశం కాబట్టి బాధ్యులు ఎవరని నిలదీశారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో ఏపీలో జరిగిన అఘాయి త్యాలను కప్పిపుచ్చుకు నేందుకే ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఏపీలో దాడులు పెరిగిపో యాయని,ఆమె అన్నారు.
రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు నాయుడు వెంకటేశ్వర స్వామిని కూడా వదలడం లేదని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జంతు వుల కొవ్వును నెయ్యిలో కలిపించినట్లు చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నా రని చెప్పారు..
addComments
Post a Comment