గుంటూరును క్లీన్ సిటిగా మారుస్తాం: కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని,

 గుంటూరును క్లీన్ సిటిగా మారుస్తాం:

కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని,



గుంటూరు (ప్రజా అమరావతి );పశ్చిమ నియోజకవర్గం లోని 25, 28వ డివిజన్లో గల చుట్టుగుంట, ఏటి అగ్రహారం, చంద్రబానుడి గుంట, జోసఫ్ నగర్ తదితర ప్రాంతాలతో పాటు లక్ష్మీ నగర్,నల్లపాడు రోడ్డు లోని డ్రైన్ సమస్యలను స్థానిక ఎమ్మెల్యే పిడుగురాళ్ల మాధవి తో కలిసి పెమ్మసాని చంద్రశేఖర్,శుక్రవారం పరిశీలించారు.

చుట్టుగుంట రైతు బజార్ సమీపంలోని   సజావుగా సాగని డ్రెయిన్లను పరిశీలించి స్థానికుల సమస్యలను పెమ్మసాని గారు అడిగి తెలుసుకున్నారు. సైడ్ కాలువలు విస్తరించని కారణంగా మురుగు పొంగి రోడ్లమీదకు చేరుతుందని ఏటి అగ్రహారం స్థానికులు మంత్రి పెమ్మసానికి వివరించారు.అనంతరం విలేకరులతో మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ ఇటీవల సంభవించిన వరదల వల్ల ఇళ్ళు నీట మునిగి ఎందరో అభాగ్యులు బాధపడ్డారని చెప్పారు. పలు ప్రాంతాలలో సైడ్ డ్రైన్లపై నిర్మాణాలు చేసిన కారణంగా మురుగు నీరు పారుదల లేదని చెప్పారు. లబ్ధిదారులకు నష్టపరిహారంతో పాటు ప్రత్యామ్నాయం చూపించిన తరువాతే డ్రైన్ల నిర్మాణాలపై ముందుకు వెళ్లాల్సి ఉంటుందనిఅన్నారు.

స్థానిక జోసఫ్ నగర్, లక్ష్మీ నగర్, నల్లపాడు రోడ్డు వద్ద జరిగిన పరిశీలనలో భాగంగా కార్పొరేషన్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాళీ స్థలాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల సామర్థ్యాన్ని బట్టి పది రోజులు మొదలు మూడు నాలుగు వారాల్లో చెప్పిన పనులు పూర్తి కావాలని స్పష్టం చేశారు.

పనిచేయని ఉద్యోగులు, సిబ్బందిపై డిసిప్లినరీ యాక్షన్ కింద చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పర్యటనలో ఆదేశించిన ప్రకారం ఈ పనులు చేయని వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. మునిసిపల్, రెవెన్యూ అధికారులు ఒక టైం బాండ్ పెట్టుకొని అందుకు తగ్గట్టుగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఎమ్మెల్యే గల్లా మాధవి, మాట్లాడుతూ ఇలాంటి దుర్భరమైన కాలనీలు నియోజకవర్గంలో చాలానే ఉన్నాయి. స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ను త్వరలో ప్రారంభిస్తాం. పశ్చిమ నియోజకవర్గాన్ని పచ్చని నియోజక వర్గంగా మార్చే బాధ్యత మేము తీసుకుంటాం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ మైనారిటీ సెల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మద్దిరాల మ్యాని,

జిఎంసి టౌన్ ప్లానర్ రాంబాబు, టీపీఎస్ లక్ష్మణస్వామి, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్, టీపీఎస్ లక్ష్మణస్వామి, తహసిల్దార్ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

Comments