విజయవాడ (ప్రజా అమరావతి);
ఏపీ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గ సమావేశం విజయవాడలో జరిగింది.
ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తు కార్యాచరణ, స్థానిక సంస్థల ఎన్నికలు, కాంగ్రెస్ సభ్యత్వం, సంస్థాగత ఎన్నికల పై పార్టీ కార్యవర్గానికి దిశా నిర్ధేశం చేయటంతో పాటు విభజన హామీలు, రాష్ట్ర సమస్యలు, రైతన్నల సంక్షేమం, మహిళల భద్రతా, నిరుద్యోగ సమస్య, సూపర్ సిక్స్ హామీల అమలుపై ఉద్యమాలు వంటి కార్యక్రమాలపై విధివిధానాలు రూపొందిచడం జరిగింది. నాయకులు నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ వారికి అండగా ఉండాలి. అవసరమైతే పోరాటాలు చేయాలి.
రాబోయే ఎన్నికల్లో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, కాంగ్రెస్ అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడమే మన ధ్యేయంగా ప్రతి కార్యకర్త, నాయకుడు ముందడుగు వేయాలి.
addComments
Post a Comment