దసరా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి , మరియు శాసనసభ్యులు వై.సుజనా చౌదరి
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, విజయవాడ (ప్రజా అమరావతి):
ఈరోజు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మరియు శాసనసభ్యులు వై సుజనా చౌదరి ఆలయమునకు విచ్చేయగా దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సత్యనారాయణ, ఐఏఎస్ మరియు ఆలయ ఈవో కె ఎస్ రామరావు స్వాగతం పలికారు.
అనంతరం వీరు ఎన్ టి ఆర్ జిల్లా కలెక్టర్ డా. సృజన, ఐఏఎస్ మరియు పోలీస్ కమీషనర్ SV రాజశేఖర్ బాబు, IPS గారు మరియు ఇతర విభాగముల, ఆలయ అధికారులు తో కలిసి అక్టోబర్ 3 నుండి 12 వరకు దేవస్థానం నందు అత్యంత వైభవముగా నిర్వహించు దసరా మహోత్సవముల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి, అనంతరం మీడియానుద్దేశించి మాట్లాడుతూ
విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దసరా మహోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో
ఎంఎల్ఏ లు మరియు అధికారులు అందరితో సమీక్షలు నిర్వహించడం జరిగింది. 13 శాఖలు సమన్వయంతో పనిచేయవల్సిన అవసరం ఉంది.
ఇప్పటివరకు జరిగిన సమీక్షలలో ఎవరి పనులు వాళ్ళకి కేటాయించి వాటిపై సమీక్ష చేసాము. జరుగుతున్న పనుల్లో కొన్ని నిర్ణయాలు తీస్కోవడం జరిగింది...
మీడియా మిత్రుల సహకారం కూడా అందించాలని కోరారు.
సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా పనులను చేస్తున్నాము...
క్యూ లైన్ ల లో ఎటు వంటి ఇబ్బంది ఉండకుండా చూసుకుంటున్నాము.
పోలీస్ యంత్రాంగం పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలను పరిశీలిస్తున్నారు...
కలెక్టర్ మరియు కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇద్దరు సమన్వయంతో విధులు నిర్వహిస్తారు...
అన్ని ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు...
250సీసీ కెమెరా లలో అధికారులు పరిశీలిస్తారు...
Vvip దర్శనాలు ఉదయం 8 నుండి 10 మధ్యలో మరియు 2-4 గంటల వరకు
టైంను మైంటైన్ చెయ్యాలి
వీవీఐపీ దర్శనాలు జరిగే సమయంలో ఏ ఒక్క సామాన్య భక్తుడి లైను ఆపడం జరగదు...
వృద్ధులకు దివ్యాంగులకు సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు దర్శనాల సౌకర్యం ఇవ్వడం జరుగుతుంది...
అంతరాలయం దర్శనం లేదు...
వచ్చిన ప్రతీ ఒక్కరికి కూడా అన్నప్రసాదాలు, లడ్డూలు అన్నీ నాణ్యతతో ఉండాలి అని సూచించడం జరిగింది..
నాణ్యతలో ఎక్కడ రాజికి అవకాశం లేదు
ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా అధికారులదే బాధ్యత ...
త్రాగునీరు రెండు విధాలుగా ఇవ్వాలని నిర్ణయింఛాం. ప్రతిసారి వాటర్ ప్యాకెట్లను ఇస్తున్నారు. ఈసారి వాటర్ ప్యాకెట్లతో పాటు వాటర్ బాటిల్లను కూడా(35 లక్షల నెం. లు) ఇవ్వడం జరుగుతుంది...
పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా మునిసిపల్ వాళ్లను అలర్ట్ చేయడం జరిగింది.
ఇంద్రకీలాద్రి పైన జరిగే అమ్మవారి ఉత్సవాలు వెలుగులతో దేదీప్యమానంగా అలంకరణలు చేస్తున్నాము...
నగరం అంతా ప్రత్యేకమైన ఏర్పాట్లు అలంకరణలు చేస్తున్నాము.
దసరా వెలుగులో నగరమంతా ఉండేలా ఆదేశాలు జారీ...
1వ తారీకు అందరం ఇన్స్పెక్షన్లు చేయడం జరుగుతుంది...
రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా రావాలని ఆహ్వానిస్తున్నాము
ముఖ్యమంత్రి వర్యులను రేపు వెళ్లి స్వయంగా ఆహ్వానించడం జరుగుతుంది
అక్టోబర్ 9 వ తారీకు మధ్యాహ్నం మూలా నక్షత్రం రోజున అమ్మవారికి ప్రభుత్వం లాంచనాలతో పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది...
ఒకటో తారీకు మధ్యాహ్నం 3 గంటలకు అన్ని శాఖల అధికారులతో సమీక్ష ఉంటుంది
అని తెలిపారు..
అనంతరం పశ్చిమ శాసనసభ్యులు వై. సుజనా చౌదరి మాట్లాడుతూ ఇప్పటికే పలు సార్లు అధికారులు సమావేశంలు నిర్వహించి, సమీక్షలు నిర్వహించడం జరిగినదని, భక్తులందరికీ మంచి దర్శనం కలిగేలాగా ఏర్పాట్లు చేయడం జరుగుచున్నదని, భక్తులే మొదటి ప్రాధాన్యత గా అన్ని శాఖల సమన్వయంతో ఉత్సవాలు నిర్వహించడం జరుగుచున్నదని, మీడియా మిత్రుల సహకారం కూడా అందించాలని తెలిపారు.
addComments
Post a Comment