*విహారయాత్రలో విషాదం*
అల్లూరి జిల్లా:సెప్టెంబర్ 22 (ప్రజా అమరావతి);
అల్లూరి జిల్లా మారేడు మిల్లిలో జలతరంగిని జలపాతం వద్ద ఈరోజు సాయంత్రం విషాదం చోటుచేసుకుంది,
ఏలూరు మెడికల్ కళాశాలకు చెందిన వైద్య విద్యార్థులు విహారయాత్ర కోసం వచ్చి జలతరంగిణి జలపాతం వద్ద ఐదుగురు వైద్య విద్యార్థులు గల్లంతు అయ్యారు.
ఈరోజు సాయంత్రం ఒక్కసారిగా వాగు ఉధృతం గా రావడంతో విద్యార్థుల గల్లంతు అయ్యారు. గల్లం తైన వారిలో నలుగురు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. ఒక అమ్మాయిని స్థానికులు రక్షించారు. ఆమెను ఆస్పత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు.మిగతా ముగ్గురు అమ్మాయిలు, ఓ అబ్బాయి కోసం గాలింపు కొనసాగుతోంది.
పోలీసులు స్థానికుల సహాయంతో వైద్య విద్యార్థుల కోసం సహాయక చర్యలు చేపట్టారు. కాగా సంఘటన స్థలంలో వర్షం కురుస్తుండడంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది.
addComments
Post a Comment