అన్నవరపు లంక గ్రామం నందు వరద బాధితుల కోసం ప్రభుత్వం వారు నిర్వహిస్తూన్న పునరావాస కేంద్రాలను సందర్శించిన జడ్పీ చైర్ పర్సన్

 కొల్లిపర (ప్రజా అమరావతి);

కొల్లిపర మండలం అన్నవరపు లంక గ్రామం నందు వరద బాధితుల కోసం ప్రభుత్వం వారు నిర్వహిస్తూన్న పునరావాస కేంద్రాలను


జెడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి కత్తెర హెనీ క్రిస్టినా , కేంద్ర మంత్రి వర్యులు శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ , మాజీ మంత్రి వర్యులు . ఆలపాటి రాజేంద్రప్రసాద్  సందర్శించారు.

     ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం వారు వరద బాధితుల కోసం ఏర్పాటు చేసిన భోజన వసతులు మరియు ప్రభుత్వం చేసిన సహాయక చర్యలను గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు.

      రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వరద బాధితుల కోసం ఏర్పాటు చేసిన 1000 కిట్లను ప్రజలకు అందించారు. ఈ కిట్లలో ఒక దుప్పటి, మంచి నీరు, నిత్యావసర వస్తువులు వున్నాయి.

       అనంతరం వరదలో మునిగిపోయిన పంట పొలాలు మరియు ఇటుకల బట్టిలను పరిశీలించి,రైతులతో మాట్లాడారు. వారికి ప్రభుత్వం నుండి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందేలా చూస్తాము అని తెలియజేశారు. 

      ఈ సందర్భంగా ఎంతో కష్టపడుతూ ప్రజలు అండగా వున్న ప్రభుత్వ అధికారులందరికి కృతజ్ఞతలు చెప్పారు.

    ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా కలెక్టర్ శ్రీమతి s. నాగలక్ష్మి IAS , తెనాలి సబ్ కలెక్టర్ v. సంజనా సిన్హా , డిప్యూటి సీఈఓ మోహనరావు , కొల్లిపర ఎం.ఆర్.ఓ , ఎంపిడిఓ ,  ప్రభుత్వ అధికారులు,  సిబ్బంది పాల్గొన్నారు.

Comments