విజయవాడ (ప్రజా అమరావతి);
పశ్చిమ నియోజకవర్గం లో 54,55,56 డివిజన్ లలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పర్యటించారు. గడపగడపకు తిరుగుతూ వరద బాధితుల అవసరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి నిత్యవసర సరుకులు, తాగునీరు,వారికి సరిగా అందుతున్నాయో లేదో అక్కడ ఉన్నా అధికారులు అడిగి తెలుసుకున్నారు. డివిజన్లో తిరుగుతూ వారికి నిత్యవసర సరుకులు బియ్యం కూరగాయలు, ఇతర ఇతర సామాగ్రిఅందజేశారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాజకీయాలు చేయడానికి కూడా సమయం, సందర్భం, వేళ, పాల అంటూ కొన్ని పరిమితులు ఉంటాయి.
కానీ జగన్ ఈ పరిమితులను ఎప్పుడు గౌరవించలేదు,
ఎప్పుడు ఆ హద్దులకు కట్టుబడలేదు.తానూ ఎదగడానికి తన పార్టీని ఏ స్థాయికైనా దిగజార్చగలడని జగన్ మరోసారి నిరూపించుకున్నడు. తన అనాలోచిత చర్యల ఫలితంగానే వైసీపీ ఇప్పుడు ఈ పరిస్థితులను ఎదుర్కొంటుంది అనేది వైసీపీ నేతలు కూడా ఒప్పుకునే వాస్తవమే. అయితే వరద రాజకీయాలతో ప్రభుత్వం పై బురద జల్లడానికి జగన్ చేస్తున్న ప్రయత్నాలు వైసీపీ పాలిట శాపంలా మారుతున్నాయి.విజయవాడలోని ప్రకృతి బీభత్సానికి రాజకీయ విమర్శలు జత చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలు ఆయన స్థాయిని మరో మెట్టు కిందకుదిగదారచాయి.తప్పుడు ప్రచారాలతో, ప్రజలను రెచ్చకొట్టే ధోరణితో ఏకపక్ష రాజకీయాలు చేసే వారు నిజంగా సమాజాన్ని నాశనం చేసేస్తారు.ఇటువంటి వారికి సంఘ బహిష్కరణో, రాష్ట్ర బహిష్కరణో సరైన చర్య అవుతుందంటున్నారు ప్రజాస్వామ్యవాదులు కోరుకుంటున్నారు.ఇంట్లో కూర్చుని ప్రభుత్వం పై విమర్శలు చెయ్యడం కాదు, ఫీల్డ్లోకివచ్చిసాయమందించినిరాశ్రయును ఆదుకోవాలి, హీరోల దగ్గర కంటే ఎక్కువ స్థాయిలో జగన్ దగ్గర డబ్బులున్నాయి. కానీ ఏనాడూ ఇటువంటి విపత్తులో తనవంతు బాధ్యతగా జగన్ ముందుకొచ్చి చేయుత అందించిన ఆనవాళ్లు లేవు అనే విషయాన్ని రాష్ట్ర ప్రజలతో పాటుగా జగన్ మద్దతుదారులకు కూడా మరోసారిగుర్తుచేసుకోవాలి.గతంలో విశాఖ కేంద్రంగా వచ్చిన హుదూద్ కల్లోల్ల సమయంలో కూడా ఆనాటి టీడీపీ ప్రభుత్వానికి జగన్ 50 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ ప్రకటించారు. కానీ అది ఇప్పటికి ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ వ్యవస్థకు అందలేదు. అలాగే ఇప్పుడు పార్టీ తరుపున జగన్ ప్రకటించిన కోటి రూపాయిల సాయం కూడా పత్రికా ప్రకటన రూపంలోనే ముగుస్తోందా లేక ఆచరణ సాధ్యమవుతుందా అనేది అంతు చిక్కని ప్రశ్నే అంటున్న రాజకీయ వర్గాలు.
ఆర్బాటం ఆరు నెలలు జీతం మూడు నెలలు అన్న చందంగా జగన్ చెప్పేది కొండంత చేసేది నూలుపొగంతాజగన్విశ్వసనీయతనుప్రశ్నిస్తున్నారు.ఇప్పటి కైనా నీచ రాజకీయాలు మానుకోవాలి.ఈ సందర్భంగ మంత్రి వెంట54డివిజన్ కార్పొరేట్, డివిజన్ టీడీపీ నాయకులు తర్జున్, సలీం వార్డు సచివాలయ అధికారులుపాల్గొన్నారు.
addComments
Post a Comment