మొవ్వ, సెప్టెంబర్ 28 (ప్రజా అమరావతి);
రాష్ట్రంలో ప్రతి పేదవాడు పక్కా ఇల్లు నిర్మించుకుని గౌరవంగా జీవించాల
ని ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థ సారధి అన్నారు.
కృష్ణజిల్లా గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో శనివారం మొవ్వలో నిర్వహించిన *మన ఇల్లు- మన గౌరవం* హౌసింగ్ లబ్ధిదారుల అవగాహన సదస్సులో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గృహ నిర్మాణము ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని గృహాలన్నీ పూర్తిచేసేలా కృషి చేస్తుందన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గృహానికి రెండున్నర లక్షల వరకు ఇచ్చారని, బీసీ ఎస్సీ ఎస్టీలకు అదనంగా ఇచ్చే వారని, గత ప్రభుత్వంలో దీనిని తగ్గించి కేవలం 1.80 మాత్రమే ఇచ్చారన్నారు. రాష్ట్రంలో ఏ పేదవాడు ఇల్లు లేకుండా ఉండరాదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారన్నారు. ఒకసారి మంజూరైన గృహం పూర్తి చేసుకోకపోతే, మరల మంజూరు కాదని, లబ్ధిదారులకు అవగాహన కల్పించి అందరు ఇళ్ళు నిర్మించుకునేలా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు
మేస్త్రీలు ఎక్కువగా పిల్లర్లు వేసి పేదలపై ఖర్చు భారం మోపుతున్నట్లు తెలిసి, అధికారులను పంపి లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు.
కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు సంపూర్ణంగా నెరవేరుస్తుందని, వచ్చే దీపావళికి రాష్ట్రంలో ఉచిత గ్యాస్ పథకం అమలు చేయనున్నట్లు తెలిపారు.
పామర్రు శాసనసభ్యులు కుమార్ రాజా మాట్లాడుతూ వ్యక్తికి గౌరవం విద్య, కుటుంబానికి గౌరవం ఇల్లు, అది మనకు గౌరవం అన్నారు. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చే డబ్బులు వినియోగించుకుని యుద్ధ ప్రాతిపదికన ఇళ్ళు నిర్మించుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. ఇళ్ళు నిర్మించుకునే బాధ్యత లబ్ధిదారులు తీసుకుంటే, మౌలిక వసతులు కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.
రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ పి రాజాబాబు మాట్లాడుతూ ప్రస్తుత గృహ నిర్మాణ పథకం ద్వారా లబ్ధిదారులకు ఇచ్చే రు. 1.80 లక్షల రూపాయలు వినియోగించుకోవాలని, మార్చి నాటికి ఈ పథకం ముగింపు కానున్నదని, తదుపరి బిల్లులు రావని, అందుకే ముందుగానే ఇల్లు నిర్మించుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. ఇల్లు కట్టుకుంటే రోడ్లు, డ్రెయిన్లు, విద్యుత్ తదితర మౌలిక వసతులు ప్రభుత్వం కల్పిస్తుందన్నారు.
జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ వివిధ నిర్మాణ దశలలో ఉన్న గృహాలు సత్వరమే పూర్తి చేయాలని లక్ష్యంతో ప్రభుత్వం మన ఇల్లు మన గౌరవం కార్యక్రమం ద్వారా గృహ నిర్మాణ లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి మాసంలోగా ఇల్లు పూర్తి చేసుకుంటే, మార్చిలోగా బిల్లులు పడతాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి రాములు నాయక్, గృహ నిర్మాణశాఖ ఈఈ వెంకట్రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రొండి కృష్ణ యాదవ్, సర్పంచ్ తూము పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment