*చంద్రబాబు కృషితోనే జేపీసీకి వక్ఫ్ సవరణ బిల్లు*
*అభ్యంతరాలు తెలిపేందుకు 15మందితో ప్రత్యేక కమిటీ*
*హైదరాబాదులో జరిగిన జేపీసీ సమావేశంలో ఏపీ కమిటీ సభ్యులు పలు సూచనలు*
*రాష్ట్ర మైనార్టీ సంక్షేమ న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్*
అమరావతి సెప్టెంబర్ 28 (ప్రజా అమరావతి);
*కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలనుకున్న వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు-2024 పై ముస్లిం సమాజం నుంచి వివిధ రూపాల్లో పలు ఆందోళనకరమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో అభిప్రాయ సేకరణ నిమిత్తం బిల్లు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి (జేపీసి) వెళ్లేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేశారని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ,న్యాయ శాఖ మంత్రి ఫరూక్ పేర్కొన్నారు.ఇందులో భాగంగా జాయింట్ పార్లమెంటరీ కమిటీ నిర్వహించే అభిప్రాయ సేకరణ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రజాస్వామ్య పద్ధతిలో అభ్యంతరాలను తెలిపేందుకు 15 మందితో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి ముస్లింల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం స్పష్టం చేసిందని పేర్కొన్నారు.వక్ఫ్ సవరణ బిల్లుపై అభిప్రాయ సేకరణ నిమిత్తం జాయింట్ పార్లమెంటరీ కమిటీ రాష్ట్రల పర్యటన చేపట్టింది. శనివారం హైదరాబాద్ తాజ్ కృష్ణలో జేపీసీ ఛైర్పర్సన్ జగదాంబికా పాల్ ఆధ్వర్యంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశమైంది. జేపీసీ కమిటీ ముందు ఏపీ, తెలంగాణ,ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ప్రతినిధులు తమ అభిప్రాయాలు వినిపించారు. జేపీసీ ఛైర్మన్ జగదాంబిక పాల్ కు ఆయా రాష్ట్రాల తరఫున వినతిపత్రాలు అందజేశారు. ఏపీ తరఫున నియమించిన 15 మందితో కూడిన ప్రతినిధుల కమిటీ సభ్యులతో వక్ఫ్ సవరణ బిల్లు పై అభిప్రాయాలు వెల్లడించేందుకు జేపీసీ సమావేశానికి ముందుగా మంత్రి ఫరూక్ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వక్ఫ్ సవరణ బిల్లు వెళ్లేలా చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు యావత్ ముస్లిం సమాజం తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. రాష్ట్రం తరఫున అత్యంత పటిష్టంగా, సాంకేతికపరమైన, సున్నితమైన అంశాలపై వక్ఫ్ సవరణ బిల్లులో ముస్లింలకు మేలు చేకూర్చే అంశాలను సమర్థిస్తూనే, వివాదాస్పద మైనటువంటి బిల్లులోని పలు అంశాలపై అభ్యంతరాలను తెలియజేయడం జరిగిందన్నారు. వక్ఫ్ సవరణ బిల్లు పై అభిప్రాయ సేకరణ సమావేశంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐఏఎస్ ఉన్నతాధికారులు , మైనారిటీ సంక్షేమ శాఖ, వక్ఫ్ బోర్డు,న్యాయవాద సంఘం, ముతావల్లిల సంఘం, మైనార్టీ సంక్షేమం, హక్కుల కోసం పోరాడే స్వచ్ఛంద సేవా సంస్థలు, ముస్లిం ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు,మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తదితరులను భాగస్వామ్యం చేస్తూ కమిటీ సభ్యులను నియమించి జేపీసీలో పలు కీలక అంశాలను లేవనెత్తడం జరిగిందని మంత్రి తెలిపారు. మైనార్టీల సంక్షేమం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే జరిగిందని, మైనార్టీల సంక్షేమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని ఫరూక్ పేర్కొన్నారు.*
*జేపీసీ అభిప్రాయ సేకరణ సమావేశానికి హాజరైన ఏపీ తరపున 15మంది ప్రతినిధులు వీరే*
*1.సి. శ్రీధర్ ఐఏఎస్, మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్*
*2.ఎల్. సుధాకర్ రావు, మైనార్టీ సంక్షేమ శాఖ డిప్యూటీ కమిషనర్*
*3.ఎల్. అబ్దుల్ ఖదీర్,వక్ఫ్ బోర్డు సీఈవో.*
*4.ఎస్.మహమ్మద్ అలీ,వక్ఫ్ బోర్డు డిప్యూటీ సెక్రటరీ.*
*5.సయ్యద్ ఆదామ్ షఫీ, వక్ఫ్ బోర్డు అసిస్టెంట్ సెక్రటరీ.*
*6.మహమ్మద్ షఫీకుజ్జామన్, మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మరియు హైకోర్టు ప్రముఖ న్యాయవాది.*
*7.డాక్టర్. మున్వార్ హుస్సేన్, మాజీ లా ఆఫీసర్,వక్ఫ్ బోర్డు మాజీ జేడీ.*
*8.ఎం.డి.సలీం పాషా, హైకోర్టు ప్రముఖ న్యాయవాది*
*9.ఎం.ఏ. కలీం బేగ్, గుంటూరు లాలాపేట్ పెద్ద మస్జీద్ ముతావలి.*
*10.ఎస్.మహమ్మద్ తాహిరుల్లా ఖాద్రి, కడప దర్గా హజరత్ సయ్యద్ షా అలీ మురాద్ ముతావల్లి.*
*11.ఎం. షాజహాన్ భాష, ఎమ్మెల్యే మదనపల్లె.*
*12.ఏం.ఏ.షరీఫ్ , మాజీ ఏపీ శాసనమండలి చైర్మన్.*
*13.ఎస్. మహమ్మద్ ఇక్బాల్, మాజీ ఐజీ, మాజీ ఎమ్మెల్సీ.*
*14.ఎం.ఏ. గఫూర్,మాజీ ఎమ్మెల్యే, ఎంఈఎస్ సి ఓ అధ్యక్షుడు.*
*15.ఎం.ఫరూక్ షుబ్లీ, మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు.*
addComments
Post a Comment