*తెనాలి మండలంలో పంట పొలాలను పరిశీలించిన జడ్పీ చైర్మన్ క్రిస్టిన
*
తెనాలి (ప్రజా అమరావతి);
ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ కత్తెర హెని క్రిస్టిన శుక్రవారం తెనాలి మండలంలోని కొలకలూరు, హాఫ్ పేట, కాజీపేట గ్రామాల్లోని నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. ఎటు చూసినా పొలాల్లో నీరు తప్ప పంట కనుచూపుమేరలో కనిపించలేదు పంట పొలాల్లో నడుము లోతుల వరకు నీళ్లు కనిపించాయి. పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి వాటి మధ్య వెళ్లే రోడ్డు తప్ప ఎక్కడ కూడా నేల కనిపించడం లేదు పంట కనిపించలేదు దీంతో ఆమె చాలా ఆవేదన చెందారు. ఈ సందర్భంగా రైతులను పలకరించారు వారు తమ గోడును జడ్పీ చైర్పర్సన్ కు విన్నవించారు వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి పంట వేసుకుంటే అకాల వర్షంతో పొలాలన్నీ నీటి మునిగి చెరువుల్ల మారిపోయాయని ఆవేదన వెలిబుచ్చారు. పంట పనికి రాదని వారు చెప్పారు.
ఈ సందర్భంగా జడ్పీ చైర్ పర్సన్ క్రిస్టినా మాట్లాడుతూ పంట పొలాలను చూస్తుంటే చాలా ఆవేదనంగా ఉందని అన్నారు. పంటను వేసుకుంటే నీట మునిగి పోయిందని అన్నారు, ఈ విషయాన్ని ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, నాదెండ్ల మనోహర్ దృష్టికి తీసుకువెళ్లి సహాయం అందేలా కృషి చేస్తానని రైతులకు హామీ ఇచ్చారు. పంటపొలాలను చూస్తే తాను కలత చెందానని చెప్పారు
హాఫ్ పేట గ్రామ సందర్శన...... అనంతరం జిల్లా పరిషత్ చైర్పర్సన్ క్రిస్టిన హపేట గ్రామాన్ని సందర్శించారు నీటి లో దిగి గ్రామస్థులతో మాట్లాడారు, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు ఆమెకు తమ కష్టాలను వివరించారు అకాల వర్షాలతో తమ కాలనీ అంతా నీట మునిగిందని చెప్పారు తమ ఇళ్లలోని గృహోప కరణాలు పాడయ్యాయని అని చెప్పారు కరెంటు లేదని తినడానికి కూడా నిత్యవసరాలు లేవని ఆవేదన వెలిబుచ్చారు ప్రజల సమస్యలు తెలుసుకున్న చైర్పర్సన్ మాట్లాడుతూ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులు లోకేష్ నాదెండ్ల మనోహర్లా దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. పలువురు మహిళలు తమ బాధలను చైర్పర్సన్ కు వివరించారు.
addComments
Post a Comment