*భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల
ని ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ కత్తెర హెనీ క్రిస్టిన ప్రజలకు సోమవారం విజ్ఞప్తి చేశారు*
గుంటూరు (ప్రజా అమరావతి );
కృష్ణా పరివాహక ప్రాంతాల్లో నివసించే ఆయా గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ కత్తెర హెనీ క్రిస్టిన కోరారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన షెల్టర్ లలో తలదాచుకోవాలని కోరారు ప్రభుత్వ యంత్రాంగం అన్ని రకాల సదుపాయాలు కలుగజేస్తుందని చెప్పారు, మరి ముఖ్యంగా డెల్టా ప్రాంతంలోని లంకల గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిరావాలని కోరారు. గంట గంటకు కృష్ణమ్మ పరవళ్ళు పెరుగుతున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల ప్రజలు అధికారుల మాటలు విని సురక్షిత ప్రాంతానికి చేరుకోవాలని కోరారు. 120 సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా కృష్ణా నదికి వరద ప్రవాహం చేరుకోవటంతో నదీ ప్రవాహక ప్రాంతాలలో వరదలు వస్తున్నాయని దీనిని గమనించి ముందుగానే ప్రజలు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో మకాం వేసి తెల్లవారుజాము వరకు విజయవాడలోని పలు ప్రాంతాలలో స్వయంగా పర్యటించి ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు అని అదేవిధంగా ప్రజలకు అవసరమైన ఆహారాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేశారని చెప్పారు. అదేవిధంగా సోమవారం ఉదయం కూడా ముంపు ప్రాంతాలను ఆయన పరిశీలించిన తీరు చూస్తుంటే ఆయనకు ప్రజలపై ఉన్న అభిమానాన్ని తెలియజేస్తుంది అన్నారు. ఏ ముఖ్య మంత్రి కూడా ఈ విధంగా స్పందించిన దాఖలాలు లేవని తెలిపారు ప్రతినిత్యం ప్రజల ప్రజల మధ్య ఉంటూ యోగక్షేమాలు తెలుసుకుంటూ అధికారులను అప్రమత్తం చేసి కేంద్రంతో మాట్లాడుతూ కావలసిన సౌకర్యాలను కల్పిస్తున్నారని చెప్పారు ప్రజలు అధైర్య పడవద్దని త్వరలోనే యధాస్థితికి జనజీవనం వస్తుందని ఆకాంక్షించారు.
addComments
Post a Comment