18 నెలల నుండి జీతాలు రాక ఇబ్బంది పడుతున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు.



*టీడీపీ  కార్యకర్త పొట్టగొట్టిన కొండేటి చిట్టిబాబు*

*18 నెలల నుండి జీతాలు రాక ఇబ్బంది పడుతున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు


*

*భూముల కబ్జాలపై పలు ఫిర్యాదులు*

*పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించిన నేతలు* 

మంగళగిరి (ప్రజా అమరావతి);

తాను టీడీపీ కార్యకర్తనని నగరం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ నందు సెక్యూరిటీ గార్డుగా  పనిచేస్తున్న తన ఉద్యోగాన్ని  అప్పటి పి.గన్నవరం ఎమ్మెల్యే ప్రస్తుత మాజీ అయిన కొండేటి చిట్టిబాబు కక్షగట్టి తీయించారని.. గత 22 సంవత్సరాలుగా ఉద్యోగం చేసుకుంటున్న తనకు ఉద్యోగం లేకుండా చేసి పొట్టగొట్టాడని.. దానిపై కోర్టుకు వెళితే.. కోర్టు ఉద్యోగం ఇవ్వాలని ఆర్డర్ ఇచ్చినా.. చిట్టిబాబు జోక్యంతో కలెక్టర్ ఉద్యోగం ఇవ్వలేదని .. దాంతో ఉపాధి లేక తన కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు  పడుతుందని.. తనకు ఉపాధి కల్పించి ఆదుకోవాలని.. కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం ఈదరాడ గ్రామానికి చెందిన సాదనాల సుబ్బారావు నేడు మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ లో మంత్రి గుమ్మడి సంధ్యారాణి, మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మీలకు వినతి పత్రం ఇచ్చి అభ్యర్థించారు.  



గత ప్రభుత్వంలో జోగి రమేష్ అండదండలతో పోలీసుల్లో కొంతమంది తమ బాధ్యతలను మరిచి అక్రమాలకు అన్యాయాలకు సహకరించారని.. తమపైనే దాడి చేసి తిరిగి తమపైనే అక్రమ కేసులు పెట్టి వేధించారని.. అది తప్పుడు కేసు అని సీఐ పరిశీలించి కొట్టేయాలని చెప్పినా.. నాడు ఎస్సై అంకమరావు, స్టేషన్ రైటర్ కోట శేఖర్ లు వైసీపీ నేతలకు కొమ్ము కాస్తూ..  తమను బెదిరించి డబ్బులు తీసుకుని. కేసు క్లోజ్ చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని.. బాధితులు  ఏ కొండూరు మండలానికి చెందిన తేళ్యూరి రాహేలు, తేళ్యూరి రామకృష్ణలు నేడు గ్రీవెన్స్ లో నేతలను కలిసి తమ గోడు చెప్పుకున్నారు. తప్పుడు కేసులు కొట్టేయాలని వేడుకున్నారు.

పాతూరి విజయ్ కుమార్, పాతూరి వంశీలు  తన పొలానికి సరిహద్దులుగా ఉన్న తాటి చెట్లను నరికేసి తమ పొలాన్ని ఆక్రమించేందుకు యత్నిస్తున్నారని..  మూడు సార్లు సర్వే జరగకుండా అడ్డుకున్నారని.. తన పొలం ఆక్రమణకు గురికాకుండా సర్వే చేయించి న్యాయం చేయాలని  పశ్చిమ గోదావరి జిల్లా చేబ్రోలు మండలానికి చెందిన వల్లభనేని మాదవ్ నేడు గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశాడు. 

నెల్లూరులోని ఏసిఎస్ఆర్ ప్రభుత్వ సర్వజన వైద్యశాల నందు ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేయుచున్న ఉద్యోగులకు 18 నెలల నుండి జీతాలు ఇవ్వడంలేదని.. దాంతో తమ కుటుంబాలు గడవటం కూడా కష్టంగా ఉందని.. దయచేసి జీతాలు ఇప్పించి  ఆదుకోవాలని  s. అఫ్రీన్, సుదీర్ తదితరులు నేడు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి అభ్యర్థించారు.

కర్నూలు జిల్లా కోసగి మండలం చిన్న భూంపల్లి గ్రామంలో ఉన్న ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో నాడు నేడు పనుల్లో భాగంగా చేపట్టిన గదుల నిర్మాణం  అసంపూర్తిగా ఆగిపోయాయని దయచేసి నిధులు మంజూరు చేసి  నిర్మాణాలు పూర్తి  అయ్యేలా చూడాలని ఆ ఊరి గ్రామ ప్రజలు నేడు గ్రీవెన్స్ లో నేతలకు అర్జీ ఇచ్చారు. 

యార్లగడ్డ రామమోహన్ రావు అనే వ్యక్తి విజ్ఞప్తి చేస్తూ.. తమకు  బాపట్ల జిల్లా రేపల్లే మండలం ఉప్పూడి గ్రామంలో 86 సెంట్లు పట్టా కలిగిన మాగాని భూమి ఉందని దాన్ని గతంలో ఇళ్ల స్థలాలకోసం తీసుకొని పరిహారం ఇవ్వకపోవడంతో కోర్టు వెళితే ఇళ్లు నిర్మించకుండా స్టే ఆర్డర్ ఇచ్చారని.. అయితే ఆ భూమిలో ఇప్పుడు ఆక్రమణదారులు అక్రమంగా ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారని.. వాటిని అడ్డుకుని తమ భూమిని  తమకు ఇప్పించాలని వేడుకున్నాడు. 

తన కుమారుడు మూడున్నరేళ్ల నుండి కనిపించడంలేదని.. రావులపల్లి  ఆంజనేయులు అనే వ్యక్తి  తన స్వగ్రామమైన పమిడిపాడు నుండి తన కొడుకును తీసుకెళ్లాడని.. అప్పటి నుండి ఇప్పటి వరకు  తన కొడుకు జాడ తెలియ లేదని.. పోలీసు అధికారుల వద్దకు వెళితే పోలీస్ స్టేషన్ లో రోజంతా కూర్చో పెడుతున్నారు తప్ప.. ప్రయోజనం ఉండటం లేదని.. తన కొడుకు జాడ కనిపెట్టాలని  పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం పమిడిపాడు గ్రామానికి చెందిన నంబుల రమణమ్మ విజ్ఞప్తి చేశారు. 

తాము వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నామని.. గ్రామంలో అందరి భూములను చుక్కల భూములనుండి తొలగించి.. తమ భూములను మాత్రం చుక్కల భూములుగానే ఉంచారని.. వైసీపీ నాయకులు తన పొలాన్ని రెగ్యులరైజ్ చేయవద్దని చెప్పడంతో అధికారులు పట్టించుకోలేదని.. దయచేసి తన భూములను చుక్కల భూములనుండి తొలగించి సాయం చేయాలని నెల్లూరు జిల్లా కావలి మండలానికి చెందిన పాటిబండ్ల శ్రీనివాసులు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి అభ్యర్థించారు.

ఏపీ మోడల్ స్కూల్స్ నందు పనిచేస్తున్న  అటెండర్ మరియు వాచ్ మెన్ ల అసోసియేషన్ సభ్యులు విజ్ఞప్తి చేస్తూ..  తమను అవుట్ సోర్సింగ్ పద్దతి నుండి తొలగించి కాంట్రాక్ట్ పద్దతిలోకి మార్చి మినమ్ టైం స్కేల్ ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని వారు అభ్యర్థించారు. 

విజయవాడ 59 వ డివిజన్ తో పాటు పలువురు వరద బాధితులు తమకు వరద పరిహారం అందలేదని. గ్రీవెన్స్ కు వచ్చి అర్జీలు ఇచ్చి వరదల వల్ల తాము పూర్తిగా నష్టపోయామని.. తమకు వరద సాయం అందించి ఆదుకోవాలని వేడుకున్నారు. 


ఆరోగ్య సమస్యల కారణంగా గతంలో ఆర్థిక సాయం కోసం దరఖాస్తులు పెట్టుకున్న పలువురికి సీఎంఆర్ఎఫ్ నుండి మంజూరైన చెక్కులను  నేడు రాష్ట్ర మంత్రి సంధ్యారాణి, మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మీల చేతుల మీదుగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో అందజేశారు. చెక్కులు తీసుకున్న వారు హర్షం వ్యక్తం చేస్తూ.. ప్రభుత్వానికి రుణపడి ఉంటామని.. సీఎం చంద్రబాబు పేదలకు చేస్తున్న మేలును మరిచిపోలేమని కొనియాడారు.

Comments