ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజయం తథ్యం.

 ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్రప్రసాద్  విజయం తథ్యం.





వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే అర్హతే లేదు.


ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలపై జగన్మోహన్ రెడ్డి  పగబట్టారు.


-మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాదు .


గొల్లపూడిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం.


ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్ (ప్రజా అమరావతి);


ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి బలపరిచిన మాజీ మంత్రి శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్  విజయం తథ్యమని మైలవరం ఎమ్మెల్యే శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు  అన్నారు. 


ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలను అభివృద్ధి చేయకుండా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ఈ ప్రాంతంపై పగబట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో పరిశ్రమలు రాకుండా అడ్డుకున్నారని, ముఖ్యంగా అమరావతి రాజధానిని చేయటాన్ని జీర్ణించుకోలేక జగన్మోహనరెడ్డి  ఈ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేశారని పేర్కొన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే అర్హత కూడా లేదన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసే వరకు ప్రతి కార్యకర్త యుద్ధంలో సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు.


పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని దత్త కళ్యాణమండపంలో ఎమ్మెల్యే కృష్ణప్రసాదు  ఆధ్వర్యంలో క్లస్టర్, యూనిట్, బూత్ కన్వీనర్లు, మండల పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, మైలవరం నియోజకవర్గ ఎన్డీఏ మహాకూటమి ముఖ్యనేతల సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారం, పట్టభద్రులకు ఓటు నమోదుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. 


ఈ సమావేశంలో మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు తో పాటు, మాజీమంత్రి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ (రాజా) , విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ (చిన్ని) , జిల్లా టీడీపీ అధ్యక్షులు శ్రీ నెట్టెం రఘురాం , శాసనమండలి సభ్యులు, టీడీపీ కేంద్ర కార్యాలయ కార్యదర్శి పరుచూరి అశోక్ బాబు , మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ)  పాల్గొన్నారు. ముందుగా అన్న ఎన్టీఆర్  ప్రతిమకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాదు  మాట్లాడుతూ


ఏపీని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  అధోగతి పాలు చేశారని అన్నారు. అతని విధానాల వల్ల రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడిందన్నారు. వరదల్లో కూడా బురద రాజకీయాలు చేయటం జగన్ గారి నైజమన్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు కనీసం వీసమెత్తు సాయం కూడా చేయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై మహాకూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేశాడని పేర్కొన్నారు. 


తెలుగుదేశం పార్టీకి క్రమశిక్షణ గల వ్యక్తి ఆలపాటి రాజా  అన్నారు. సార్వత్రిక ఎన్నికల తరహాలోనే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తామని అన్నారు. సీఎం చంద్రబాబు  వంద రోజుల్లో ఒక్కొక్కటిగా హామీలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. స్నేహితులు, బంధువులు, సన్నిహితులు అందరికీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల గురించి చైతన్యపరిచి అందరూ మహాకూటమి బలపరిచిన అభ్యర్థి రాజా కి ఓట్లను వేసే విధంగా ప్రోత్సహించాలని కోరారు. ప్రతి కార్యకర్త కంకణ బద్దులై పనిచేయాలని పిలుపునిచ్చారు.


ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్  మాట్లాడుతూ వచ్చే ఏడాది మార్చిలో జరగబోయే కృష్ణ గుంటూరు జిల్లాల పట్ట భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా తనను ఎంపిక చేసిన  సీఎం శ్రీ చంద్రబాబునాయుడు కి కృతజ్ఞతలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత నేత అన్న నందమూరి తారక రామారావు  నడయాడిన ప్రాంతంలో తాను ఎన్నికల్లో పోటీ చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రానికి  ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్  చేస్తున్న పరిపాలన తీరు మనందరికీ గర్వకారణం అన్నారు. వాళ్ళ నాయకత్వంలో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నా విజయానికి అండగా ఉండాలని కోరారు. 


విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ (చిన్ని) , జిల్లా టీడీపీ అధ్యక్షులు శ్రీ నెట్టెం రఘురాం , శాసనమండలి సభ్యులు, టీడీపీ కేంద్ర కార్యాలయ కార్యదర్శి పరుచూరి అశోక్ బాబు , మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ)  తదితరులు మాట్లాడుతూ ఆలపాటి రాజా కి అందరూ ఐకమత్యంగా కృషి చేసి ఘనవిజయం అందించాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వంలో జగన్మోహనరెడ్డి  విధానాల వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు. ఏపీని గాడిలో పెట్టేందుకు సీఎం చంద్రబాబు  ఎంతో కష్టపడుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులు, ఎన్డీఏ మహాకూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Comments