అమరావతి (ప్రజా అమరావతి);
• *తానేటి వనిత తన అక్క అంటూ.. 10 లక్షలు దోపిడీ*
• *వైసీపీ రిగ్గింగ్ ను అడ్డుకున్న టీడీపీ నేతలపై రౌడీషీట్ ఓపెన్ చేసిన పోలీసులు*
• *ఉద్యోగాలను తొలగించి వైసీపీ తమను రోడ్డున పడేసిందంటూ పలువురు ఏఎన్ఎంలు మొర*
• *వైసీపీ నేతలు పెట్టిన అక్రమ కేసులు తొలగించాలని పలువురు టీడీపీ కార్యకర్తలు విన్నపం
*
తానేటి వనిత తనకు అక్క అవుతుందని చెప్పి సబ్ రిజిస్ట్రర్ యూనియన్ ప్రెసిడెంట్ తనకు బావ అవుతాడని చెప్పి కొవ్వూరు సబ్ రిజిస్ట్రర్ ఆఫీసునందు లేఖరుగా పనిచేస్తున్న దాసరి స్టాలిన్ తమ కూతుర్లకు చెందాల్సిన ఆస్థిని రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తానని తమ వద్ద రూ. 10 లక్షలు తీసుకుని మోసం చేశాడని.. ఇంటికి వెళ్లి అడిగితే చంపేస్తామని బెదిరిస్తున్నాడని ఏలూరు జిల్లా ఏలూరుకు చెందిన బలే నరసరాజు టీడీపీ కేంద్రకార్యాలయంలో నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలు మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డిలకు అర్జీ ఇచ్చి వాపోయారు. బాధితుల నుండి అర్జీలు స్వీకరించిన నేతలు అధికారులతో ఫోన్లలో మాట్లాడి వెంటనే సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.
• 2024 ఎన్నికల్లో వైసీపీ నాయకులు రిగ్గింగ్ కు పాల్పడుతుంటే అడ్డుకున్నందుకు తమను పోలీసులు స్టేషన్ కు పిలిచి తమ మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారని.. దయచేసి తమపై పెట్టిన రౌడీషీట్ ను తొలగించాని దర్శినియోజకవర్గం బొట్లపాలెం గ్రామానికి చెందిన బత్తిన శ్రీకాంత్, బొట్ల వెంకటేశ్వరరావు, బత్తిన వెంకట నరేంద్ర బాబు, రాఘవలు విజ్ఞప్తి చేశారు.
• ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఎనర్జీ అసిస్టెంట్ ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తూ.. గత ప్రభుత్వంలో ఎన్నోసార్లు అర్జీ ఇచ్చినా తమ సమస్యలను పట్టించుకోలేదని.. ప్రమోషన్లతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని వారు మంత్రి గొట్టిపాటి రవికుమార్ కు వినతి ఇచ్చి అభ్యర్థించారు.
• ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి.. రాజశేఖర్ రెడ్డి, నిరంజన్ రెడ్డిలు తన వద్ద రూ. 12 లక్షల తీసుకుని మోసం చేశారని.. డబ్బులు అడిగితే కులం పేరుతో తిడుతున్నారని.. కొడుతున్నారని.. తనకు ఆడపిల్లలు ఉన్నారని.. దయచేసి డబ్బులు ఇప్పించి ఆదుకోవాలని అనంతపురం జిల్లా రాప్తాడు మండలం పుల్లలరేవు గ్రామానికి చెందిన పి.సి పెద్దన్న వాపోయాడు.
• అధికారులే రికార్డులు తారుమారు చేస్తూ తమకు అన్యాయం చేస్తున్నారని..తన తండ్రి పేరుమీద ఉన్న పొలాన్ని వేరోకరికి కట్టబెట్టేందుకు తన తండ్రి ఫోటో తీసి మరోకరి ఫోటోతో పాసుపుస్తకాలు సృష్టించారని.. దీనిపై విచారించి తమకు న్యాయం చేయాలని. తప్పుడు పనులు చేస్తున్న అధికారులను ఉద్యోగాలనుండి తొలగించాలని ప్రకాశం జిల్లా కనిగిరి మండలం వంగపాడు గ్రామానికి చెందిన కాకర్ల కొండయ్య, కాకర్ల శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు.
• వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన దివ్యాంగుల పింఛన్లను వెంటనే పునరుద్ధరించాలని, ప్రభుత్వం, ఆప్కాస్ ద్వారా ఏ నియామకాలు చేపట్టినా కూడా దివ్యాంగులకు రోస్టర్ పాటించాలని, కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ వర్కర్లుగా పనిచేస్తున్న దివ్యాంగులను రెగ్యులర్ చేయాలని… 2019 కంటే ముందు వివాహమైన దివ్యాంగులకు వివాహ ప్రోత్సాహం అందించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక సభ్యులు నేతలను వేడుకున్నారు.
• తన భర్త చనిపోయిన సమయంలో తన ఇంట్లోని పాస్ పుస్తకాలు కొట్టేసి తన పొలాన్ని తన మర్థి ఆక్రమించి మరోకరికి కౌలువుకు ఇచ్చాడని.. దానిపై ప్రశ్నిస్తే తనను చంపేందుకు యత్నిస్తున్నారని.. తనకు న్యాయం చేయాలని నెల్లూరు జిల్లా వింజమూరు మండలం నందిగుంట్ట గ్రామానికి చెందిన షేక్ షాహిన్ నేడు నేతలను కలిసి అభ్యర్థించారు.
• ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం గుమ్మళంపాడు గ్రామానికి చెందిన సర్పంచ్ సుబ్బారావు విజ్ఞప్తి చేస్తూ.. తమ గ్రామంలో బీసీలకు ప్రభుత్వం ఇండ్ల స్థలం కేటాయించిందని అక్కడ కరెంట్ సప్లైని ఏర్పాటు చేయాలని మంత్రికి విన్నవించారు.
• గత 22 సంవత్సరాలనుండి ఏఎన్ఎమ్ లుగా పనిచేస్తున్న తమను గత ప్రభుత్వం అన్యాయంగా తొలగించింది. తొలగింప పడిన వారందరూ దళిత బడుగు బలహీన వర్గాల వారే. గత ప్రభుత్వంలో న్యాయం కోసం ఎన్ని సార్లు తిరిగినా పట్టించుకోలేదు. దీనిపై కోర్టుకు వెళ్లడం జరిగింది అని మొరపెట్టుకుంటూ.. దయచేసి వైసీపీ ప్రభుత్వం తొలగించిన 203 మందికి ఏఎన్ఎమ్ ఉద్యోగాలు కల్పించాలని వారు వేడుకున్నారు.
• విజయనగరం జిల్లా గరివిడి మండలం కోసూరు గ్రామానికి చెందిన అప్పల నాయుడు విజ్ఞప్తి చేస్తూ.. వారసత్వంగా వచ్చిన భూమిని వైసీపీ నేతలు అక్రమంగా ఆక్రమించుకోని వారి పేరుపైకి మార్చుకోవడమే కాకుండా తమపై అక్రమ కేసులు బనాయించారని.. దానిపై విచారించి న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.
• విజయనగరం జిల్లా గరివిడి మండలం కోసూరు గ్రామానికి చెందిన సూర్యనారాయణ విజ్ఞప్తి చేస్తూ.. వైసీపీ నేతలు తనపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని.. తాను గుండె ఆపరేషన్ చేసుకు ఉన్న ఇడిచిపెట్టలేదని.. దయచేసి తనపై అక్రమకేసులను పరిశీలించి వాటిని తొలగించి తనపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందిపెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు.
• ఏపీ జెన్ కో, ఏపీ ట్రాన్స్ కో, మరియు డిస్కాంల్లో అనేక సంవత్సరాలుగా 25 వేల మంది కాంట్రాక్టు కార్మికులమైన తాము చాలీ చాలని జీతంతో పనిచేస్తున్నామని తమ సమస్యలను పరిష్కరించి తమను పర్మినెంట్ చేయాలని వారు నేడు ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విజ్ఞప్తి చేశారు.
• పోలవరం ప్రాజెక్ట్ ముంపునకు గురి అగుచున్న పట్టా భూమికి కొత్తగా అవార్డు నోటిఫికేషన్ ఇచి నష్టపరిహారం ఇప్పించవలసిందిగా చింతూరు మండలం చింతూరుకు చెందిన సోమక నారాయణరావు విజ్ఞప్తి చేశాడు.
• ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ట్ & క్రాప్ట్ నిరుద్యోగ ఉపాధ్యాయులు విజ్ఞప్తి చేస్తూ.. పాఠశాల విద్య ఉన్నత పాఠశాలల్లో డ్రాయింగ్ మరియు క్రాఫ్ట్ మరియు మ్యూజిక్ ఉపాధ్యాయుల నియామకంను 2024 డీఎస్సీ ద్వారా చేపట్టాలని వారు విజ్ఞప్తి చేశారు.
addComments
Post a Comment