శిశిరం చిత్రం పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ మంత్రి ఆలపాటి రాజ.

 శిశిరం చిత్రం పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ మంత్రి ఆలపాటి రాజ


గుంటూరు (ప్రజా అమరావతి): స్థానిక లక్ష్మి పురం లోని  ఆలపాటి కార్యాలయం లో సోమవారం ఉదయ శిశిరం చిత్రం మోషన్ పోస్టర్ ను మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 

ఆవిష్కరించారు.

శ్రీ కృష్ణ ఆర్ట్స్ బ్యానర్ పై అమిరినేని వెంకట్ ప్రసాద్, సాదు చలపతి, కన్నెగంటి రవి, అనిల్ మూకిరి సహ నిర్మాతలు గా సీనియర్ జర్నలిస్టు,  వరల్డ్ రికార్డు హోల్డర్ కనపర్తి రత్నాకర్ దర్శకత్వంలో  శిశిరం నూతన చిత్రం రూపొందుతుంది. ఈ సందర్భం గా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ రత్నాకర్ గతం లో వీరస్థలి తెనాలి అనే దేశభక్తి చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకుల మన్ననలను పొందారని, తెనాలి ప్రాంత జాతీయ స్ఫూర్తి, స్వాతంత్ర ఉద్యమం లో తెనాలి వాసుల కీర్తిని చాటారన్నారు. విద్యా వ్యవస్థ పై తీస్తున్న మరో చిత్రం శిశిరం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

 చిత్ర యూనిట్ కు అభినందనలు తెలిపారు. చైల్డ్ సూపర్ స్టార్, కేజీఎఫ్ ఫేమ్ మాస్టర్ భాను, మాస్టర్ పుష్కర్ , గోము , యామిని, వెంకట్, మధుకర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నట్లు దర్శకులు రత్నాకర్ తెలిపారు. కథ, స్క్రీన్ ప్లే వెంకట్ ప్రసాద్, పాటలు సురేంద్ర రొడ్డా, ఆర్ట్ ఎం. వెంకట్, ప్రొడ్యూషన్ ఇంచార్జీ గా ఎం. శ్రీకాంత్ లు వ్యవహరిస్తున్నారని దర్శకులు తెలిపారు.

Comments