శ్రీ కోటసత్తెమ్మ అమ్మవారి దయ, కరుణ కటాక్షం రాష్ట్ర ప్రజలందరి పై ఉండాలి.

 



నిడదవోలు (ప్రజా అమరావతి);


 *శ్రీ కోటసత్తెమ్మ అమ్మవారి దయ, కరుణ కటాక్షం రాష్ట్ర ప్రజలందరి పై ఉండాల


ని కోరుకున్న రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్*


..నిడదవోలు మండలం, తిమ్మరాజుపాలెం గ్రామం లో  వేంచేసియన్ను శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారి " దేవీ నవరాత్రులు మహోత్సవము ల "  10 వ రోజు " విజయ దశమి" సందర్భంగా శ్రీ అమ్మవారిని దర్శించుకున్న ..


..మంత్రి కందుల దుర్గేష్ 


 దసరా దేవీ నవరాత్రుల్లో భాగంగా శనివారం నిడదవోలు మండలం, తిమ్మరాజుపాలెం గ్రామం లో  వేంచేసియన్ను శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారిని దర్శించుకొని  రాష్ట్ర ప్రజలు ఆరోగ్యవంతంగా, సుఖసంతోషాలతో,  అష్టైశ్వర్య భోగభాగ్యాలతో  ఉండాలని అమ్మవారిని వేడుకోవడం జరిగిందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక , సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.


 దేవీ నవరాత్రుల్లో 10 వ రోజు శనివారం " విజయ దశమి" సందర్భంగా శ్రీ అమ్మవారిని దర్శించుకుని  ప్రత్యేక  పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా  అర్చకులు  వేదమంత్రాలతో స్వాగతం పలికి,   ప్రత్యేక పూజలు నిర్వహించి , ఆశీర్వచనం అందజేశారు. కమిటీ సభ్యులు అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు.


 ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ   జగన్మాత శ్రీశ్రీశ్రీ కోట సత్తేమ్మ అమ్మవారి దయ కరుణ కటాక్ష వీక్షణాలు  రాష్ట్ర ప్రజలందరి పై ప్రసరించి అందరి జీవితాలు బాగుపడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానన్నారు.




Comments