ఎన్డీయే అభ్యర్థుల గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.



*ఉమ్మడి తూర్పు గోదావరి-పశ్చిమ గోదావరి, కృష్ణా-గుంటూరు జిల్లాల టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యనేతలతో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్*


*పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ల నమోదుపై నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం*


*ఎన్డీయే అభ్యర్థుల గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి*


*జనసేన, బీజేపీలతో సమన్వయంతో ముందుకెళ్లాలి*


*టెలీకాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు సూచనలు* 

అమరావతి (ప్రజా అమరావతి);

తూర్పుగోదావరి- పశ్చిమ గోదావరి పట్టభద్రుల ఎన్నికల అభ్యర్ధిగా పేరాబత్తుల రాజశేఖర్, గుంటూరు-కృష్ణా జిల్లాల అభ్యర్ధిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను ఎన్డీయే తరపున ఇప్పటికే ప్రకటించాం. 

నాలుగు జిల్లాల్లోని నేతలందరి అభిప్రాయాలు తీసుకుని అభ్యర్థులను ప్రకటించాం. 

పట్టభద్రుల ఓట్ల నమోదుకు వచ్చే నెల 6వ తేదీ చివరి రోజు. ఆ లోపు ఓటర్ల నమోదును పూర్తి చేయాలి. 

ప్రతి నియోజకవర్గంలో మూడు పార్టీల నేతలతో కో ఆర్డినేషన్ మీటింగ్ లు ఏర్పాటు చేసుకోవాలి. 

నియోజకవర్గాల వారీగా నమోదైన ఓటర్ల వివరాలను నేతలకు వివరించిన సీఎం. 

మూడు పార్టీలు కలిసి పని చేయడం వల్ల మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో 93 శాతం సీట్లు సాధించాం.

రాష్ట్రాభివృద్ధి కోసం రేయింబవళ్ళు కష్టపడి పని చేస్తున్నాం. ఈ అంశాలు ప్రజల్లోకి వెళ్లాలి. 

కేంద్ర కేబినెట్ అమరావతి రైల్వేలైనుకు ఆమోదం తెలిపింది. రూ.4,300 కోట్లతో గ్రామాల్లో అభివృద్ధి పనులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనులు ప్రారంభించారు. 

ప్రభుత్వంలో ఉండి పనులు చేయడం ఎంత ముఖ్యమో...ఆ పనుల సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం కూడా అంతే ముఖ్యం. 

నాలుగు నెలల్లో అమలు చేసిన పథకాలు, తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు వివరించాలి. ప్రజల కోసం తీసుకొచ్చిన పాలసీలు, పథకాలపై చర్చ జరగాలి. 

ప్రతి పట్టభద్రుడూ ఓటు నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా.  

ఇప్పటికే డీఎస్సీ ప్రకటించాం. ప్రైవేట్ రంగంలో పెట్టుబడులను తీసుకొచ్చేందుకు 6 పాలసీలు తీసుకొచ్చాం.

నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకుని జాబ్ ఫస్ట్ విధానంతో ఉద్యోగ కల్పనకు ప్రయత్నిస్తున్నాం. 

ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకు అడుగు ముందుకేస్తున్నాం. 

ఏపీ బ్రాండ్ ను పునరుద్ధరించేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నాం. 

ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో ఉండి ఓట్లు నమోదు చేయించాలి. 

విజయవాడ వరద బాధితులకు ఎప్పుడూ లేని విధంగా దెబ్బతిన్న ఒక్కో ఇంటికి రూ.25 వేల ఆర్థిక సాయం అందించాం. ఎవరూ ఊహించనిస్థాయిలో సాయం అందించాం. 

నామినేటెడ్ పోస్టుల భర్తీపైనా చర్చిస్తున్నాం. 

అందరం కలిసి కట్టుగా పనిచేసి శాశ్వతంగా ఎన్డీయే గెలిచేలా చూడాలి. దేశం, రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వాలు చేస్తున్న  అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి.

మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పని చేయాలి. 

పొలిటికల్ గవర్నెన్స్ లో భాగంగా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. 

మండలాల వారీగా ఎన్డీయే కో-ఆర్డినేషన్ కమిటీలు ఏర్పాటు చేసుకొని ముందుకెళ్లాలి.

మనం పని చేయాల్సింది ఇప్పటి కోసమే కాదు. 2029లోనూ మళ్లీ ఎన్డీయే గెలుపే లక్ష్యంగా పనిచేయాలి...రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రభాగాన నిలబెట్టాలి. 

విజన్ 2047 డాక్యుమెంట్ ను ప్రధాని మోదీ ఆవిష్కరిస్తారు. 

రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో మంచి మెజారిటీతో కూటమి అభ్యర్ధులు గెలిచేలా నేతలు నియోజకవర్గాల్లో పని చేయాలి. 


Comments