*వరల్డ్ స్కేట్ గేమ్స్ లో కాంస్యం సాధించిన ఆర్యాణి ను అభినందించిన రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి*
విజయవాడ, అక్టోబరు ,05 (ప్రజా అమరావతి): ఇటీవల ఇటలీ లో జరిగిన వరల్డ్ స్కేట్ గేమ్స్ ఇటలీ-2024 రోలర్ డెర్బీ విభాగంలో ఇండియా తరుఫున ఆడి కాంస్య పతకం సాధించిన చేబోయిన ఆర్యాణి ను విజయవాడ క్యాంపు కార్యాలయంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి అభినందించారు.ఆర్యాణి అభిరుచి తెలుసుకుని ఆ రంగంలో ప్రొత్సహించటమే కాకుండా, స్వయంగా కోచింగ్ ఇచ్చిన తండ్రి శివపరమేశ్వరరావు, తల్లి నాగస్వర్ణ ను ప్రత్యేకంగా అభినందించారు. విజయవాడ మధురానగర్ కి చెందిన ఆర్యాణి వరల్డ్ స్కేట్ గేమ్స్ ఇటలీ -2024 లో కాంస్య పతకం గెలుపొందిన విషయం తెలుసుకుని ఆహ్వానించారు. ఈ ఛాంపియన్షిప్ లో ఆస్ట్రేలియా అమెరికా తో జరిగిన మ్యాచ్ లో ఉత్తమ ప్లేయర్ గా ఆర్యాణి అవార్డ్ పొందింది. అలాగే 2019 స్పెయిన్ లో జరిగిన వరల్డ్ స్కేట్ గేమ్స్ లో అత్యుత్తమ ప్రదర్శన తో సెమీస్ వరకు వెళ్లిగలిగింది. తనని అభినందించిన క్రీడ శాఖ మంత్రికి చెబోయిన ఆర్యాణి కృతజ్ఞతలు తెలిపారు.
addComments
Post a Comment