ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ - ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (PM-JAY) పథకం విస్తరణ.

 మంగళగిరి (ప్రజా  అమరావతి);


ఈ రోజు ధన్వంతరి జయంతి & 9వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా,  ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ  ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ - ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (PM-JAY) పథకం విస్తరణను మరియు బహుళ ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులు కింద ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఫార్మాస్యూటికల్స్ మరియు ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ విభాగం న్యూ ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద AIIA నుండి రూ.12,850/- కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించారు..


AIIMS మంగళగిరి కూడా భాగమైన ప్రీమియర్ తృతీయ సంరక్షణ సంస్థల నుండి ఆరోగ్య సేవల కోసం డ్రోన్ సేవల సదుపాయాన్ని ప్రారంభించడంలో భాగంగా, AIIMS మంగళగిరి ఆడిటోరియంలో దేశవ్యాప్తంగా వర్చువల్ ప్రారంభోత్సవాలు & ప్రారంభ కార్యక్రమాలను ప్రదర్శించారు మరియు గౌరవనీయ డైరెక్టర్ & CEO ప్రొఫెసర్ డాక్టర్ మధబానంద కర్ గారి సమక్షంలో AIIMS మంగళగిరి నుండి  గ్రామీణ ఆరోగ్యం సంస్థ (CRHA), నూతక్కి సెంటర్ మధ్య డ్రోన్ సేవలు ప్రారంభించబడింది. 


గర్భిణీ స్త్రీ రక్త నమూనాలను సేకరించి CRHA నూతక్కి నుండి AIIMS ఆసుపత్రికి 9 నిమిషాల (15 కి.మీ) వ్యవధిలో రవాణా చేయటం జరిగింది . ఈ డ్రోన్ సేవతో వారంలో రెండుసార్లు పనిచేస్తాయి.  ప్రధాన మంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ (PMSMA) పథకం కింద AIIMS మంగళగిరి CRHA నూతక్కి వద్ద ఉచితంగా గర్భిణీ స్త్రీలకు సమగ్ర జనన పూర్వ సంరక్షణ సేవలు అందిస్తోంది మరియు రక్త నమూనాలను మరింత సమగ్రమైన పరీక్షలు (థైరాయిడ్ మరియు OGTT) అవసరమైన పరీక్షల కోసం డ్రోన్ ఉపయోగించి CRHA, Nuattaki నుండి AIIMS మంగళగిరికి రవాణా చేస్తారు.  

Comments