పింఛనుదారులు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించేందుకు నవంబర్ 13న ఏలూరులో శిబిరాలు నిర్వహణ.

 

పింఛనుదారులు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించేందుకు నవంబర్ 13న ఏలూరులో శిబిరాలు నిర్వహణ


'డిజిటల్ లైఫ్‌ సర్టిఫికెట్‌ 3.0' దేశవ్యాప్త ప్రచారంలో భాగంగా శిబిరాలు నిర్వహణ


 12 నవంబర్ 2024

విజయవాడ  (ప్రజా అమరావతి ;                                           .

ముఖ గుర్తింపు సాంకేతికత (ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీ) ద్వారా పింఛనుదారులు 'లైఫ్‌ సర్టిఫికెట్‌సమర్పణను క్రమబద్ధీకరించడానికికేంద్ర పింఛన్లు పింఛనుదార్ల సంక్షేమ విభాగం (డీవోపీపీడబ్ల్యూ) ఈ నెలలో దేశవ్యాప్తంగా 'డీఎల్‌సీ ప్రచారం 3.0'ను నిర్వహిస్తోంది. ఈ సాంకేతికతతోఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లలో ఆధార్-ఆధారిత గుర్తింపు ద్వారా పింఛనుదారులు తన జీవిత ధృవీకరణ పత్రాలను సమర్పించవచ్చు.

గతంలోపింఛనుదారులు పింఛను ఇచ్చే కార్యాలయాలకు వెళ్లవలసివచ్చేది. ఇది వృద్ధులకు ఇబ్బందిగా ఉండేది. 2014లోడీవోపీపీడబ్ల్యూ డిజిటల్ లైఫ్‌ సర్టిఫికెట్‌‌లు (జీవన్ ప్రమాణ్)ముఖ గుర్తింపు సాంకేతికతను 2021లో ప్రవేశపెట్టింది. ఈ నూతన సాంకేతికతబయోమెట్రిక్ పరికరాల అవసరాన్ని తొలగించి ధృవీకరణ ప్రక్రియను మరింత అందుబాటులోకి తెచ్చింది.

2022లోడీవోపీపీడబ్ల్యూ 37 ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించి 1.41 కోట్ల డీఎల్‌సీలను జెనరేట్‌ చేసింది. 2023లో ఆ ప్రచారం 100 ప్రాంతాలకు విస్తరించింది 1.47 కోట్లకు పైగా డీఎల్‌సీలు ఉత్పత్తి అయ్యాయి.

ఈ సంవత్సరంప్రచారం 3.0 (నవంబర్ 1-30 తేదీల్లో నిర్వహణ) దేశవ్యాప్తంగా 800 స్థానాల్లో జరుగుతుంది. బ్యాంకులుఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్పెన్షనర్స్ అసోసియేషన్లుఉడాయ్‌కేంద్ర ఎలక్ర్టానిక్స్ సమాచార సాంకేతికత మంత్రిత్వ శాఖరక్షణ మంత్రిత్వ శాఖరైల్వే శాఖటెలీకమ్యూనికేషన్స్‌ విభాగం వంటివి ఈ ప్రచారంలో కీలక భాగస్వాములుగా ఉన్నాయి. డిజిటల్ సర్టిఫికెట్‌ సమర్పణలో పింఛనుదారులకు సాయం చేయడానికి దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. సూపర్ సీనియర్ పింఛనుదారులు లేదా దివ్యాంగ పింఛనుదారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లుఅవసరమైతే ఇంటి వద్దకే వెళ్లడం వంటివి చేస్తారు. డీవోపీపీడబ్ల్యూ పర్యవేక్షణ కింద డీఎల్‌సీ పోర్టల్ ద్వారా సామాజిక మాధ్యమాలు ప్రచారం 3.0ను ప్రోత్సహిస్తాయి.

మారుమూల ప్రాంతాలు లేదా పరిమిత అనుసంధానత ఉన్న ప్రాంతాల్లోని పింఛనుదారులు కూడా ఈ వ్యవస్థ ద్వారా ప్రయోజనం పొందేలా చూడడమే ప్రచారం లక్ష్యం.

ఆంధ్రప్రదేశ్‌లోయూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏలూరు నగరంలోని సీఆర్‌ఆర్‌ కళాశాలసెయింట్ థెరిసా కళాశాలఅశోక్ నగర్ఏలూరు యూబీఐ ఆర్‌ఆర్‌ పేట్‌ఏలూరు యూబీఐ ఆర్‌ఆర్‌ పేట్‌ క్యాబ్‌లో శిబిరాలు నిర్వహిస్తోంది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ తన పోస్ట్‌మెన్గ్రామీణ డాక్ సేవక్‌ల ద్వారా పింఛనుదారుల కోసం క్యాంపులు నిర్వహిస్తోంది ఇంటి వద్దకే వెళ్లి సేవలు అందిస్తోంది. 13 నవంబర్ 2024 బుధవారం నాడుడీవోపీపీడబ్ల్యూ అసిస్టెంట్ డైరెక్టర్ (ఓఎల్‌) శ్రీమతి మంజు గుప్తా యూబీఐఐపీపీబీ నిర్వహిస్తున్న శిబిరాలను సందర్శిస్తారు. లైఫ్‌ సర్టిఫికెట్‌‌లను సమర్పించేందుకు వివిధ డిజిటల్ విధానాలను ఉపయోగించడంలో పింఛనుదారులకు ఆమె సాయం చేస్తారు. ఆధార్‌ వివరాలు నవీకరించడానికి లేదా ఏదైనా సాంకేతిక సమస్య వస్తే అక్కడికక్కడే పరిష్కరించడానికి ఈ శిబిరాల్లో ఉడాయ్‌ అధికారులు కూడా పాల్గొంటారు.

Comments