ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన నాదెండ్ల
కొల్లిపర (ప్రజా అమరావతి);
కొల్లిపర మండలం వల్లభాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పౌరసరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ పరిశీలించడం జరిగింది. ముందుగా వల్లభాపురం గ్రామంలో ధాన్యం ఆరబోసిన రైతులు వద్దకు మంత్రివర్యులు వచ్చి అక్కడ ఆరబోసిన రైతులతో మాట్లాడుతూ రైతులు దళారుల నమ్మి ప్రభుత్వం అందించే మద్దతు ధర కన్నా తక్కువ ధరకు అమ్ముకుంటున్నారని రైతులు 17% కన్నా ఎక్కువ తేమ శాతం ఉన్న రైతులు యొక్క ధాన్యాన్ని కొనుగోలు చేస్తారు అని మరియు తేమ శాతం 23% వరకు ఉన్నా కానీ క్వింటాలకు కేజీ చొప్పున తీసివేసి కొనుగోలు చేయటం జరుగుతుందని తెలియపరిచినారు, మరియు లారీలకు జిపిఎస్ లేకుండానే మిల్లులకు పంపించడం జరుగుతుందని ప్రభుత్వానికి ధాన్యం అమ్మిన ప్రతి రైతుకు అమ్మిన 24 గంటల లోపే డబ్బులు జమ చేయడం జరుగుతుందని తెలిపినారు. జాయింట్ జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ, సివిల్ సప్లై డి ఎం లక్ష్మి,, ఏ డి ఏ ఎన్. ఉషారాణి, కొల్లిపర తాసిల్దార్ జి. సిద్ధార్థ , అధికారులు సివిల్ సప్లై అధికారులు, మాజీ మార్కెట్ చైర్మన్ వంగాసామిరెడ్డి, ఆళ్ల. వీరారెడ్డి, ఎన్టీఆర్. కోటిరెడ్డి, సుధాకర్ రెడ్డి,, తెలుగుదేశం, జనసేన, బిజెపి నాయకులు,మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment