కల్లాల వద్దే ధాన్యం కొనుగోలు
ట్రాన్స్పోర్ట్, గోనె సంచులు, కూలీలు కొరత లేకుండా చర్యలు
తొందరపడి దళారులకు ధాన్యం అమ్మి మోసపోవద్దు
రాష్ట్రవ్యాప్తంగా 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహారం పౌరసరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్
గుంటూరు బాపట్ల జిల్లాలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటన
అమరావతి (ప్రజా అమరావతి);
మంగళగిరి నియోజకవర్గం చిర్రావూరు, గుండె మెడ, దుగ్గిరాల మండలం గోడవర్రు, తెనాలి నియోజకవర్గం వల్లభాపురం మున్నంగి, వేమూరి నియోజకవర్గం కొల్లూరు, ఈపూరు, కాప్రా, జంపని గ్రామాల్లో రోడ్డు వెంబడి ధాన్యం ఆరబోసిన రైతులతో మంత్రి మాట్లాడారు వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు వల్లభాపురం నందు రైతులు కరకట్ట వద్దకు మాత్రమే ఆర్టీసీ బస్సు వస్తుందని దీంతో ఇబ్బందులు పడుతున్నామని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు..స్పందించిన మంత్రి ఆర్టీసీ అధికారులతో మాట్లాడి వల్లభాపురం పేరంటాలమ్మ గుడి వరకు ఆర్టీసీ బస్సు నడపాలని ఆదేశించారు..
జంపని గ్రామం వద్ద ప్రకృతి వ్యవసాయ రైతులు పడుతున్న ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు స్పందించిన మంత్రి ప్రకృతి వ్యవసాయం ప్రోత్సహించేందుకు త్వరలోనే వ్యవసాయ సదస్సును నిర్వహిస్తామని తెలిపారు
అనంతరం తెనాలి క్యాంప్ కార్యాలయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియా సమావేశం లో మాట్లాడారు.
ప్రతి జిల్లా నుంచి వచ్చిన సమాచారం మేరకు రైతుకు భరోసా నింపేందుకు అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగిందన్నారు.గత ప్రభుత్వంలో ఇదే మిల్లు కి అమ్మాలని రైతులకు నిబంధన ఉండేది..... ఆ నిబంధనన్ని తొలగిస్తూ రైతులకు నచ్చిన మిల్లుకు ధాన్యం అమ్ముకునే సౌకర్యం కల్పించడం జరిగింది.
ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1100 కోట్లు దాన్యం కొనుగోలు చేశాం .
గత సంవత్సరం గత ప్రభుత్వం చేసిన కొనుగోలుతో పోల్చుకుంటే 100% కొనుగోలు పెరిగింది రైతు నుంచి ధాన్యం కొనుగోలు జరిగిన వెంటనే 24 గంటల నుంచి 30 గంటల్లోపు వారి ఖాతాల్లో నగదు జమవుతుంది.
కల్లాల వద్ద రైతు నుంచి ధాన్యం కొనుగోలు కి లారీ,గోతాలు హమాలీలు కొరత లేకుండా చర్యలు చేపట్టాలనిఅధికారులకు ఆదేశం ఇవ్వడం జరిగినది ..
గతంలో జిపిఎస్ విధానం ఉండేది ఎక్కడైతే జిపిఎస్ విధానం ఉందో ఆ నిబంధనను కూడా తొలగించమని ఈ ఐదు జిల్లాల్లో వాతావరణ ఇబ్బందులు కారణంగా జిపిఎస్ తో సంబంధం లేకుండా ధాన్యం కొనుగోలు జరగాలని రైతులకు మేలు చేయాలని ఉద్దేశంతో ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అనేక ప్రాంతాల నుంచి వచ్చిన సమాచారం మేరకు ధాన్యం కొనుగోలు ప్రక్రియ అద్భుతంగా జరుగుతుంది ధాన్యం కొనుగోలు జరిగిన వెంటనే రైతు ఖాతాలో నగదు జమ కావడంతో రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది .
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధతో ధాన్యం కొనుగోలు పై రైతులకు మేలు జరిగేందుకు అనేక సంస్కరణలు చేశారురైతులు తమ మొబైల్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటలిజన్స్(AI) ఉపయోగించి వాట్సప్ ద్వారా ధాన్యం అమ్మకం జరపచ్చు ఎప్పుడు అమ్ముకోవాలో కూడా తానే నిర్ణయించుకోవచ్చు అన్నారు.నమ్మకంతో ప్రభుత్వానికి ధాన్యం అమ్మి రైతులు మద్దతు ధర పొందాలన్నారు.
addComments
Post a Comment