అర్హులైన ప్రతి పేదవారికి ఇల్లు కల్పించాలనేది సిఎం చంద్రబాబు నాయుడు లక్ష్యం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి.



*డిసెంబర్ 2024 నాటికి రాష్ట్రంలో లక్ష ఇల్లు పూర్తిచేసి లబ్ధిదారులకు ఇంటి తాళం చెవులు అప్పచెప్పే బృహత్తర కార్యక్రమం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా చేపట్టనున్నాం*


*అర్హులైన ప్రతి పేదవారికి ఇల్లు కల్పించాలనేది సిఎం చంద్రబాబు నాయుడు లక్ష్యం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి*



తిరుపతి,నవంబరు09 (ప్రజా అమరావతి): డిసెంబర్ 2024 నాటికి రాష్ట్రంలో లక్ష ఇల్లు పూర్తిచేసి లబ్ధిదారులకు ఇంటి తాళం చెవులు అప్పచెప్పే బృహత్తర కార్యక్రమం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా చేపట్టనున్నామని, అర్హులైన ప్రతి పేదవారికి ఇల్లు కల్పించాలనేది సిఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు.


శనివారం మధ్యాహ్నం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు ఆంధ్ర రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి వర్యులు ఉమ్మడి చిత్తూరు తిరుపతి జిల్లాలలో హౌసింగ్ శాఖపై సమీక్ష నిర్వహించారు. అనంతరం పాత్రికేయుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ PMAY1.ఓ  పథకం లో భాగంగా  ఈ  రెండు జిల్లాలకు మంజూరు అయిన  గృహాలు సుమారుగా 50 శాతం పూర్తి అయ్యాయని, కొన్ని చోట్ల 70 శాతం మేర పూర్తి అయిందని తెలిపారు. కొన్ని చోట్ల ఇసుక కొరత, వర్షం కారణంగా ఆలస్యం కావడంతో సకాలంలో గృహ నిర్మాణ పనులు పూర్తి స్థాయిలో జరగలేదని తెలిపారు. సదరు అంశంపై ఉమ్మడి చిత్తూరు  జిల్లాలలో గృహ నిర్మాణ పనుల పురోగతిపై జాయింట్ కలెక్టర్, సంబంధిత అధికారులతో సమీక్ష జరిపామని అన్నారు.  అదేవిధంగా ఎన్టీఆర్ హౌసింగ్ నిర్మాణాలకు లే ఔట్స్ కు ఇసుకను ప్రాధాన్యత గా ఇవ్వాలని  అధికారులను ఆదేశించామన్నారు. గృహ నిర్మాణానికి సంబంధించిన ఇసుక అవసరాల కొరకు అందుబాటులోని ఇసుకను ట్రాన్స్పోర్ట్ చేసుకోమని సూచించామని, సదరు రవాణా చార్జీలను గృహ నిర్మాణశాఖ భరించెల ఆదేశించామని తెలిపారు. అదే విధంగా  స్థానిక ఎమ్మెల్యే లు  వారి నియోజకవర్గంలో గృహ నిర్మాణాలలో కొన్ని సమస్యలను, అవకతవకలు ఉన్నాయని  తెలియపరిచారని,  వాటిని కూడా త్వరలో అన్నిటికి  పరిష్కారం చూపుతామన్నారు.  గృహ నిర్మాణాలలో లోపాలను ఉన్నతాధికారులకు పంపాలని ఆదేశించామని తెలిపారు.   అదేవిధంగా కుప్పంలో ఇల్లు నిర్మాణం జరిగాయి కానీ, దానికి కావలసిన విద్యుత్ సౌకర్యమును రెస్కో, ఏపీఎస్పీడిసిఎల్ వారు సమన్వయంతో ఏర్పాటు చేయవలసి ఉందని అన్నారు. అక్కడ నిర్మాణం జరిగిన ఇళ్ళకు  విద్యుత్ కొరత లేకుండా కొత్త సబ్ స్టేషన్ ఏర్పాటు  చేయుటకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించామన్నారు.  అదేవిధంగా లే ఔట్ లలో మౌళికవసతుల ఏర్పాటు గురించి శాసన సభ్యులకు వారి నియోజకవర్గంలో వారికి మంజూరు అయిన నరేగా నిధుల్లో నుండి కొంత నిధులను కాలనీలలో మౌలిక వసతులకొరకు ఉపయోగించాలని ఎమ్మెల్యే లను కోరామని తెలిపారు. కేంద్రం నిధులు జలజీవన్ మిషన్, అమృత్, నరేగా నిధుల నుండి  కాలనీ లలో మౌలిక సదుపాయాలు నిబంధనల మేరకు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించామని తెలిపారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా హౌసింగ్ పై ఎక్కువ శ్రద్ధ కనబరుస్తున్నారని    ముఖ్యంగా ఇళ్ల నిర్మాణంలో ఎటువంటి అవకతవకలకు అవకాశం లేకుండా  క్వాలిటీ పరంగా రాజీ లేకుండా త్వరితగతిన పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ల సమావేశంలో అదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు.  పేద ప్రజలకు  ఈ ప్రభుత్వం  మంచి నాణ్యమైన  ఇళ్లను నిర్మించి ఇస్తామని తెలిపారు. ఇంటి నిర్మాణంలో ఏమైనా సమస్యలు ఉంటే హౌసింగ్ శాఖ వారు పరిష్కారం చేస్తారన్నారు. అదేవిధంగా  వినియోగదారుడు ఇళ్ల నిర్మాణం చేపట్టి హౌసింగ్ వారికి బిల్లులు సమర్పించిన వారం లోపల వాటి ఖాతాలో డబ్బులు జమ అవుతాయన్నారు. మార్చి 2025 నుండి PMAY 2.0 కార్యక్రమం ప్రారంభం కానుందని తద్వారా కేంద్ర ప్రభుత్వం నుండి ఇళ్లను మంజూరు చేసి ప్రతి పేద వారికి ఇళ్లను అందిస్తామని తెలిపారు. టిడ్కో గృహాల బాధితులను ఆదుకుంటాం. గతంలో 2014-19 కాలంలో నిర్మించిన టిడ్కో ఇల్లు 90 శాతం పూర్తయిన వాటిని కూడా గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యం చేసి లబ్ధిదారులను ఇబ్బందికి గురి చేశారని తద్వారా లబ్ధిదారులను నష్టపోయారని తెలిపారు.హౌసింగ్ కాలనీల్లో మౌలిక వసతులను కేంద్ర పథకాలు నరేగా, అమృత్, జల జీవన్ మిషన్ తదితర పథకాల అనుసంధానంతో చేపడుతున్నామని అన్నారు. బాధ్యతగా గృహాల నిర్మాణాలకు లక్ష్యం నిర్దేశించుకుని పూర్తి చేసేలా, లబ్ధిదారులను మోటివెట్ చేసి, సంబంధిత శాసన సభ్యులు, ప్రజా ప్రతినిదులు సహకారంతో స్టేజి కన్వర్షన్ జరిగేలా చర్యలు చేపట్టి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామని అన్నారు. బిల్లుల చెల్లింపుకు నిధుల కొరత లేదని తెలుపుతూ, లబ్ధిదారులకు బిల్లులు నిధులు ఉన్నా చెల్లించకుండా నిర్లక్ష్య వైఖరి వహిస్తే అధికారులపై చర్యలు తీసుకుంటామని అన్నారు.

గత ప్రభుత్వ హయంలో హౌసింగ్ లో  జరిగిన అవకతవకలపై విచారణ జరుగుతోందని అన్నారు.


జుగుప్సాకరంగా పోస్టులు పెట్టే వారిని వదిలిపెట్టేది లేదని, మహిళలు, చిన్నారులపై ఇష్టానుసారం పోస్టులు పెడితే కఠినంగా శిక్షిస్తామని అన్నారు.

నాలుగు నెలల్లో ప్రజారంజకమైన పాలనను అందించామని, ప్రభుత్వాన్ని విమర్శించలేక కొందరు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.


 ఈ సమీక్షలో జెసి శుభం బన్సల్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ వెంకటగిరి ఎమ్మెల్యే కొరగొండ్ల రామకృష్ణ, పూతల పట్టు ఎమ్మెల్యే మురళి, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చీఫ్ ఇంజనీర్ శ్రీ జీవి ప్రసాద్, ఎస్ఈ నాగభూషణం సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, చిత్తూరు ఉమ్మడి జిల్లా ఆర్డీఓ లు,  తాశిల్డార్లు, హౌసింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. 



Comments