అమరావతి (ప్రజా అమరావతి);
• *నిడమర్రులో గతంలో నిలిచిపోయిన NDB రోడ్ల పనులు తిరిగి ప్రారంభించిన మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి*..
• *మంగళగిరి నియోజకవర్గంలో నేడు NDB రోడ్ల పనులు పరిశీలించిన మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి*
• *ప్రభుత్వం చొరవతో తిరిగి ప్రారంభమైన NDB రోడ్ల పనులు*
రాష్ట్రంలో రోడ్లకు సరికొత్త రూపు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంద
ని, ఇందు కోసం దశల వారీగా రోడ్ల పనులు పూర్తి చేసేందుకు ఒక నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి అన్నారు.. మంగళగిరి నియోజకవర్గంలోని నిడమర్రు గ్రామంలో గత ప్రభుత్వంలో నిలిచిపోయిన మంగళగిరి - నిడమర్రు NDB రోడ్డుకు సంబంధించిన పనులను నేడు మంత్రి పున: ప్రారంభించారు. అదే సమయంలో అక్కడి రోడ్ల పనులను పరిశీలించిన మంత్రి, అక్కడ పనుల తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు...
ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి మాట్లాడుతూ, మా యువనేత, సహచర మంత్రి వర్యులు నారా లోకేష్ గారి నియోజకవర్గమైన మంగళగిరి నుంచే NDB రోడ్లు పనులు తిరిగి ప్రారంభం కావడం సంతోషకరంగా ఉందన్నారు.. గత 5 ఏళ్ల పాలనలో జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారు.. దీంతో నేడు ఆయా వ్యవస్థలను సరిదిద్ది, పాలనను గాడిలో పెట్టాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందన్నారు. గత ప్రభుత్వం NDB రోడ్లకు సంబంధించిన నిధులను కూడా పక్కదారి పట్టించడంతో ఆయా రోడ్ల పనులు ఎక్కడికక్కడ అర్ధాంతరంగా నిలిచిపోయే దుస్థితికి వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు.. దీంతో దిక్కుతోచని స్థితిలో కాంట్రాక్టర్లు కూడా NDB రోడ్ల పనులను పక్కన పెట్టాల్సిన పరిస్థితి గత ప్రభుత్వంలో దాపురించిందన్నారు..
దీంతో నూతనంగా అధికారం చేపట్టిన ఎన్డీయే కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు రోడ్ల నిర్మాణంపై దృష్టిపెట్టడంతో, గ్రామగ్రామాన నేడు రోడ్ల పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. ముఖ్యంగా గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో ప్రజలు గుంతలు, గతుకులు రోడ్లతో పడ్డ కష్టాలు నేపథ్యంలో నేడు తొలి దశలో రోడ్ల మరమ్మతులు ప్రభుత్వం చేపట్టడం జరిగిందన్నారు. సంక్రాంతి నాటికి గుంతల రహిత రోడ్లే లక్ష్యంగా ఈ ప్రభుత్వం రూ. 861 కోట్లతో ఇప్పటికే పనులు కూడా ప్రారంభించడం జరిగిందన్నారు.. అదే సమయంలో వివిధ కారణాలతో గతంలో నిలిచిపోయిన పలు రోడ్లను కూడా పట్టాలెక్కించేందుకు ఈ ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తోందని, ఇందులో భాగంగా గతంలో నిలిచిపోయిన NDB రోడ్లను తిరిగి ప్రారంభించేందుకు ఆయా పనులు చేస్తోన్న కాంట్రాక్టర్లతో స్వయంగా తానే చర్చలు జరపడం జరిగిందన్నారు.. కాంట్రాక్టర్ల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో, వారికి అన్ని విధాల ప్రభుత్వం అండగా ఉంటుందనే భరోసా ఇవ్వడం కారణంగానే నేడు ఆయా కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ముందుకు వచ్చారన్నారు.. నేడు జిల్లాలో రూ. 120 కోట్లతో రోడ్ల పనులు సాగుతున్నాయని, మంగళగిరి నియోజకవర్గంలో 51.06 కోట్లతో పనులు సాగుతున్నాయన్నారు.
నేడు ముఖ్యమంత్రితో పాటు తామంతా రోడ్ల పనులకు సంబంధించి వారం వారం సమీక్షలు నిర్వహిస్తూ, పనులను పర్యవేక్షిస్తున్నామన్నారు. ప్రజలకు అసౌకర్యం లేని రహదారులే లక్ష్యంగా, పీపీపీ మోడల్ లో కొత్త రహదారుల ఏర్పాటుకు కొన్ని జిల్లాలు ఎంపిక చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. నేడు రాష్ట్రంలో 47 కోట్లతో 13 వేల కి.మీ రహదారులను పీపీపీ మోడల్ లో ఏజెన్సీల ద్వారా చేసే ఆలోచన కూడా ఉన్నట్లు తెలిపారు.
వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలో మొత్తం రోడ్లన్నీ పూర్తిగా కొత్తగా మార్చేస్తామని మంత్రి తెలిపారు. గతంలో ఇతర రాష్ట్రాల వారు సైతం మన రాష్ట్రంలో రోడ్లను అధ్యయనం చేయడానికి వచ్చేవారని, నేడు పక్క రాష్ట్రాల వాళ్లు హేళన చేసే స్థితికి మన రోడ్లు దిగజారయన్నారు. ఇటువంటి అధ్వాన్నస్థితిలో రోడ్లు ఉండటంతోనే, నేడు రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయని, టూరిజం కూడా అభివృద్ధి కాకపోవడానికి ఈ రోడ్లు కూడా ఒక ప్రధాన కారణమన్నారు.
*నిడమర్రు గ్రామ ప్రజల సమస్యలపై సానుకూలంగా స్పందించిన మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి*
నిడమర్రులో NDB రోడ్ల పనులను ప్రారంభించిన మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి అనంతరం నిడమర్రు గ్రామ ప్రజలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ లోకేష్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించిన మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు మా ప్రభుత్వం రుణ పడి ఉందని, మీకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత మాపై ఉందని మంత్రి అన్నారు.. అలాగే తీవ్ర ట్రాఫిక్ దృష్ట్యా మంగళగిరి - పరిమి రోడ్డును విస్తరించాలన్న గ్రామస్తుల కోరికపై సానుకూలంగా స్పందించిన మంత్రి.. రోడ్డును విస్తారిస్తామని గ్రామస్తులకు హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సబ్ కలెక్టర్ సంజనా సిన్హా, ఆర్ & బీ ఈ ఎన్ సీ నయిముల్లా, ఏపీ పద్మశాలీ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, నియోజకవర్గ పరిశీలకులు ముమ్మిడి సత్యనారాయణ, రాష్ట్ర సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ డైరెక్టర్ తోట పార్థసారథి, గ్రామ పార్టీ అధ్యక్షులు కుర్రా బ్రహ్మం, గ్రామ నాయకులు ఉయ్యూరు సాంబిరెడ్డి, గాదె లక్ష్మారెడ్డి, బూదాటి ఏడుకొండలు, కొమ్మారెడ్డి శ్రీనివాసులురెడ్డి, కంఠం వెంకటరెడ్డి, కుర్రా పుల్లయ్య, బొల్లా రంగారెడ్ది, బి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు
addComments
Post a Comment