శ్రీశైలంలో కార్తీక పౌర్ణమి సంబురాలు..

 *శ్రీశైలంలో కార్తీక పౌర్ణమి సంబురాలు..*



 *కిటకిటలాడిన శ్రీగిరి పురవీధులు* 

శ్రీశైలం (ప్రజా అమరావతి);

శ్రీశైల మహా క్షేత్రంలో కార్తీక పౌర్ణమి సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచి వివిధ ప్రాంతాల యాత్రికులతో క్షేత్ర పురవీధులు కిటకిటలాడాయి. పాతాళగంగలో పుణ్య స్నానాలు చేసుకుని కృష్ణమ్మకు దీప దానాలు చీరసారెలను సమర్పించుకున్నారు. పాతాళగంగలో పుణ్య స్నానాలు చేసుకుని కృష్ణమ్మకు దీప దానాలు చీరసారెలను సమర్పించుకున్నారు. శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉభయదే వాలయాల్లో అలంకార దర్శనాలు మాత్రమే కల్పించినప్పటికీ సుమారు మూడు గంటలకుపైగా దర్శన సమయం పట్టింది. క్షేత్రపరిధిలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో యాత్రికులు కూడా సహకరించాలని ఈవో చంద్రశేఖర్ ఆజాద్ కోరారు. సాయంత్రం పౌర్ణమి సందర్భంగా వచ్చిన యాత్రికులు.. ఆలయంలో జరిగే ప్రత్యేక కార్యక్రమాలను వీక్షించి స్వామివార్లను దర్శించుకునేందుకు క్యూలైన్లలో బారులు దీరారు.. 

Comments