కేంద్ర ప్రభుత్వం నుండి 'ప్రసాదం స్కీం' ద్వారా టెంపుల్ టూరిజం అభివృద్ధి


విజయవాడ (ప్రజా అమరావతి);

 శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, విజయవాడ :

   ఈరోజు  రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి  ఆధ్వర్యంలో  ఎంపీ శ్రీ కేశినేని శివనాధ్(చిన్ని) , దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మరియు కమీషనర్ శ్రీ ఎస్ సత్యనారాయణ , ఆలయ కార్యనిర్వాహనాధికారి కె ఎస్ రామరావు తో 

ఆలయ మాస్టర్ ప్లాన్ పనుల గురించి మహమండపం 7 వ అంతస్తు నందలి కార్యాలయం నందు సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగినది.


ఈ సందర్బంగా తోలుత  మంత్రివర్యులు మరియు ఎంపీ  ఆలయమునకు విచ్చేయగా ఆలయ ఈవో  ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించి, వేదపండితుల వేదాశీర్వచనం కల్పించారు. అనంతరం వీరు సమావేశం నకు హాజరు కాగా, దేవస్థానం వారు పవర్ పాయింట్ ద్వారా ప్రెజెంటేషన్ ద్వారా వివరములు తెలుపగా దేవాదాయ శాఖ, పర్యాటక మరియు ఆలయ అధికారులుతో మాస్టర్ ప్లాన్ మరియు కేంద్ర ప్రభుత్వ ప్రసాదం స్కీం గురించి  మంత్రివర్యులు, ఎంపి  పలు విషయములపై చర్చించారు.


సమావేశం అనంతరం ఎంపీ  మాట్లాడుతూ రోజురోజుకూ పెరుగుచున్న అమ్మవారి భక్తుల రద్దీ దృష్ట్యా  దేవాదాయ శాఖ మంత్రివర్యుల ఆధ్వర్యంలో రాబోయే 100 సం. ల అవసరములకు అనుగుణముగా ఏ విధముగా అభివృద్ధి చేయాలి, తధనుగుణముగా ఏ విధముగా కేంద్రం నుండి నిధులు తీసుకొని రావాలని చర్చించామని, అందులో ముఖ్యముగా వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, అమ్మవారి పవిత్రతను కాపాడుకుంటూ ఏ విధముగా ముందుకెళ్లాలి అని చర్చించామని, ఇటువంటి సమీక్షలు మళ్ళీ మళ్ళీ జరిగి పూర్తి DPR తయారు చేసుకొని,  రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారి సమీక్ష అనంతరం వారి సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు పొంది, ఆలయ అభివృద్ధి కి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.


అనంతరం మంత్రివర్యులు మాట్లాడుతూ గతంలో మాస్టర్ ప్లాన్ తయారీకి కొంత పని జరిగి, మధ్యలో అనుకోకుండా ఆగిపోవడంతో దానిని మళ్ళీ పునఃశ్శరణ చేసుకొని మళ్ళీ భవిష్యత్ అవసరములకు అనుగుణముగా ఉపయోగం లోనికి తేవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చామని, అలాగే కేంద్ర ప్రభుత్వం నుండి 'ప్రసాదం స్కీం' ద్వారా టెంపుల్ టూరిజం ను అభివృద్ధి చేస్తూ నిధులు విడుదల చేయుట జరుగుతోందని, అందులో భాగముగా ఈ ఆలయముకు కూడా అందులో చేర్చబడినదని, ఈ సందర్బంగా వీలైనన్ని ఎక్కువ నిధులు పొందుటకు ఎంపి  సూచనలు చేసి, ముఖ్యముగా క్యూ లైన్ లు, అందులో వెయిటింగ్ రూమ్ లు ఏర్పాటు, రూమ్ లు, కాటేజీ ల వసతి ఏర్పాటు చేసి భక్తులు సులభముగా అమ్మవారి దర్శనం చేసుకునేలాగా పలు సూచనలు మీద చర్చించడం జరిగిందని, రాబోయే రోజులలో జనవరి చివరి నాటికి  సమగ్ర ప్రణాళిక రూపకల్పన చేసి తదుపరి స్థానిక ప్రజాప్రతినిధులతో,  ముఖ్యమంత్రి వర్యులతో సమీక్షించి పూర్తి స్థాయిలో అమలు చేయుటకు నిర్ణయం తీసుకొనడం జరిగినదని తెలిపారు.


అనంతరం మంత్రివర్యుల చేతుల మీదుగా 2025 సంవత్సరపు ఆలయ క్యాలెండర్ ను ఆవిష్కరించడం జరిగింది.


ఈ సమావేశంలో  దేవాదాయ శాఖ చీఫ్ ఇంజనీర్ జి.వి.ఆర్ శేఖర్ , ఆలయ ఈ ఈ లు కె వి ఎస్ కోటేశ్వర రావు, టి. వైకుంఠ రావు , టూరిజం శాఖ ఈఈ, టెక్నికల్ కమిటీ మెంబెర్ పాండురంగ రావు , డి ఈ ఈ లు, ఏఈఈలు మరియు అధికారులు పాల్గొన్నారు.

Comments