ఐఎంఏ జాతీయ ఉత్తమ కార్యదర్శిగా డాక్టర్ నరేంద్ర రెడ్డి .

 ఐఎంఏ జాతీయ ఉత్తమ కార్యదర్శిగా డాక్టర్ నరేంద్ర రెడ్డి 


 

గుంటూరు (ప్రజా అమరావతి);

      ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జాతీయ ఉత్తమ కార్యదర్శిగా సీనియర్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్, సాయి భాస్కర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ బూసిరెడ్డి నరేంద్ర రెడ్డి అవార్డు అందుకున్నారు.. 2023-2024 సంవత్సరానికి గాను గుంటూరు బ్రాంచ్ ను జాతీయస్థాయిలో పలు విభాగాలలో ఉత్తమ పనితీరు కనపరిచేలా తీర్చిదిద్దినందుకు గాను డాక్టర్ బూసిరెడ్డికి ఈ అవార్డు వరించింది . ఈ నెల 28న హైదరాబాదులో జరిగిన ఐఎంఏ జాతీయ సమావేశాల్లో డాక్టర్ నరేంద్ర రెడ్డికి ఈ అవార్డును అందుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా  డాక్టర్ బూసిరెడ్డి అనేక కార్యక్రమాలను చేపట్టి గుంటూరు బ్రాంచ్ కు జాతీయస్థాయిలో గుర్తింపు తీసుకువచ్చారు. గుంటూరు బ్రాంచ్ చరిత్రలో 

నిలిచిపోయేలా విజయవాడ వరదల సమయంలో ఆపన్నులను ఆదుకునేందుకు సుమారు15 లక్షల రూపాయల కు పైగా వైద్యుల నుంచి సేకరించి రాష్ట్ర శాఖ ద్వారా  సీఎం రిలీఫ్ ఫండ్ కు అందజేశారు. కనీ విని ఎరుగని వరదల కారణంగా బురద మయం అయిన గృహాలను శుభ్రపరిచేందుకు 50 కి పైగా హై ప్రెజర్ పంపులను సేకరించి అగ్నిమాపక శాఖకు  అందజేశారు. ఈ విషయమై జాతీయ స్థాయి నుంచి ప్రశంసలు అందాయి. అలాగే డాక్టర్స్ దివాళి  సెలబ్రేషన్స్, ఇఫ్తార్ విందు, ఆర్ జి కర్  నిరసన కార్యక్రమాలను తనదైన శైలిలో నిర్వహించి గుంటూరు బ్రాంచ్ కు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారు. జాతీయ ఉత్తమ కార్యదర్శిగా అవార్డు అందుకున్న డాక్టర్ బూసిరెడ్డి నరేంద్ర రెడ్డిని ఐఎంఏ రాష్ట్ర, స్థానిక నాయకులు, పలువురు వైద్యులు, అభినందనలు తెలియజేశారు.

Comments