పార్టీలో ఇంకెప్పటికీ తప్పులు జరగవు నేను హామీ ఇస్తున్న(DVR)...

 *పార్టీలో ఇంకెప్పటికీ తప్పులు జరగవు నేను హామీ ఇస్తున్న(DVR)...


*


దుగ్గిరాల (ప్రజా అమరావతి);

*మహారాష్ట్రలోనే ఎలక్షన్స్అలా జరిగితే ఆంధ్రప్రదేశ్లో ఇంకెలా జరిగాయో(ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు)....*



దుగ్గిరాల మండలం   వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ  నాయకుల,కార్యకర్తలు ఆత్మీయ సమావేశం ఆదివారం ఉదయం మంగళగిరి లోని ఆత్మకూరు జాతీయ రహదారి  నందు గల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దుగ్గిరాల  మండలం మాజీ కన్వీనర్ శృంగారపాటి రత్నం అధ్యక్షుతన ఆత్మీయ సమావేశం నిర్వహించటం జరిగింది. *ఈ సమావేశంలో సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి (DVR),ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతురావు పాల్గొన్నారు.* ఈ సందర్భంగా సమావేశాన్ని ఉద్దేశించి *సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి (DVR)* మాట్లాడుతూ దుగ్గిరాల మండలానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఓ చరిత్ర ఉంది. దుగ్గిరాల మండలంలో పార్టీని మరింత బలోపేతం చేయాలి. గతంలో జరిగిన పొరపాట్లు పార్టీలో ఇంకెప్పటికీ  జరగవు నేను హామీ ఇస్తున్నాను. ప్రతి కార్యకర్తకి నేను వెన్నంట ఉంటా  పార్టీ కోసం కష్టపడే ప్రతి వ్యక్తికి తోడుగా ఉంటాను. ఇప్పటికి చాలాసార్లు చంద్రబాబు మాటలకు ప్రజలందరూ మోసపోయారు. చంద్రబాబు నాయుడు చూపులు ఎప్పుడు కార్పొరేటర్ సంస్థల పైన డబ్బున్న వ్యక్తులపైనే తప్ప సామాన్య ప్రజల పైన ఆయన చూపు ఉండదు. దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో పేద ప్రజల అభివృద్ధికి బాట వేసింది. జగన్మోహన్ రెడ్డి మరో రెండు అడుగులు ముందుకు వేసి పేద ప్రజల కోసం నవరత్నాల పథకాలను ప్రవేశపెట్టారు. అలాంటి వ్యక్తి ఈరోజు ప్రజలకు అండగా లేకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వల్ల ఆర్థికంగా పేద ప్రజలు అభివృద్ధి చెందలేరు మన పిల్లలు పై చదువులకు వెళ్లలేరు. జగన్ అనే వ్యక్తి ఓడిపోవడం వలన బాధపడేది బాధపడుతుంది పేద ప్రజలు. అన్ని రాష్ట్రాల్లో ఈవీఎం ఎలక్షన్స్ పై అభ్యంతరాలు వస్తున్నాయి. మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే బడుగు, బలహీన వర్గ ప్రజల అభివృద్ధి జరుగుతుంది అన్నారు *ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మాట్లాడుతూ* మహారాష్ట్ర లో జరిగిన ఎలక్షన్లు ఈవీఎంలో పార్టీ ఓట్లు లేవు అని కాంగ్రెస్ ప్రధాన ఆరోపణ చేస్తుంది. మహారాష్ట్రలోనే అలా జరిగితే ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఎలా జరిగాయో అర్థమవుతుంది. ఈవీఎం అప్డేట్ అయి ఎలక్షన్స్ జరిగితే మరల అధికారపక్షం గెలుస్తుంది తప్ప ప్రతిపక్షం గెలవదు. ఎలక్షన్స్ ఎలక్ట్రిక్ పద్ధతులు జరిగితే ప్రజాస్వామ్యంలో ప్రజలు మోసపోతారు. ఈవీఎం ఎలక్షన్స్ ను అన్ని రాష్ట్రాల్లో అభ్యంతరం చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసం ఎంతగానో కృషి చేశారు. కానీ ఈవీఎం ఎలక్షన్స్ వల్ల పూర్తిగా ప్రజలు మోసపోయారు. దుగ్గిరాల మండలం ఆనాడు నుండి ఈనాటి వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీదే. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసిలు, ఎంపీటీసీలు, మాజీ వార్డు మెంబర్స్, మాజీ సర్పంచులు,ఉప సర్పంచులు, నాయకులు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు...

Comments