ఫిబ్రవరి 5న వైయస్సార్‌సీపీ ‘ఫీజు పోరు’

 ఫిబ్రవరి 5న వైయస్సార్‌సీపీ ‘ఫీజు పోరు’


పార్టీ కేంద్ర కార్యాలయంలో పోస్టర్‌ ఆవిష్కరణ


తాడేపల్లి (ప్రజా అమరావతి): ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం వైయస్సార్‌సీపీ పోరాటం. ఫిబ్రవరి 5న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లకు డిమాండ్‌ పత్రాలు. విద్యార్ధులు, తల్లిదండ్రులతో కలిసి వైయస్‌ఆర్సీపీ ఆందోళన. ఇప్పటి వరకు రూ.3900 కోట్ల ఫీజులు, స్కాలర్‌షిప్స్‌ బకాయి. ఫీజులు చెల్లించక పోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు. విద్యార్థులను నానా ఇక్కట్లకు గురి చేస్తున్న విద్యా సంస్థలు. విద్యార్ధుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటం.


వైయస్సార్‌సీపీ నేతల ఆక్షేపణ


2019లోనూ ఫీజులు బకాయిపెట్టి పోయిన చంద్రబాబు. టీడీపీ ప్రభుత్వం నుంచి దిగిపోయే నాటికి రూ.2800 కోట్లు

అధికారంలోకి రాగానే ఆ బకాయిలు తీర్చిన జగన్‌ ప్రభుత్వం. ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం విద్యార్ధులకు అన్యాయం. దీన్ని వైయస్సార్‌సీపీ ఏ మాత్రం సహించబోదు. పోరాడుతుంది. పోస్టర్‌ రిలీజ్‌ సందర్భంగా వైయస్సార్‌సీపీ నేతల స్పష్టీకరణ


రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల విడుదల కోసం ఫిబ్రవరి 5న తలపెట్టిన ‘ఫీజు పోరు’ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.

Comments