రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు...

 విజయవాడ (ప్రజా అమరావతి);

శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ:

     ఈరోజు ఇంద్రకీలాద్రికి విచ్చేసి కనకదుర్గ అమ్మ వారిని దర్శించుకున్న  ఏపీ సిఎం నారా చంద్రబాబు నాయుడు ...


ఈ సందర్బంగా  రాష్ట్ర ముఖ్యమంత్రి  ఆలయమునకు విచ్చేయగా రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మరియు కమీషనర్ ఎస్ సత్యనారాయణ, ఐఏఎస్ , అదనపు కమీషనర్ మరియు ఆలయ కార్యనిర్వాహనాధికారి కె.రామచంద్ర మోహన్  ఆలయ మర్యాదలతో  పూర్ణ కుంభ స్వాగతం పలికారు.


*ముఖ్యమంత్రి వర్యుల వారితో కలసి అమ్మవారిని  రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత , ఉత్తరాంధ్ర ఇన్చార్జి బుద్దా వెంకన్న  మరియు ప్రజా ప్రతినిధులు ఉన్నారు.


అనంతరం ముఖ్యమంత్రి  అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు.


అనంతరం వేదపండితులు  వీరికి వేదాషీర్వచనం చేయగా,  దేవాదాయ శాఖ కమీషనర్  మరియు ఆలయ ఈవో  అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదములు మరియు చిత్రపటం అందజేశారు. 


అనంతరం సిఎం చంద్రబాబు నాయుడు  మాట్లాడుతూ


రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు...


ప్రజల దర్శనంతో పాటు ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నాను...


రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నాను...


అమ్మ దయతో సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా మా పాలన సాగుతోంది...


ఈ సంవత్సరం రెండు తెలుగు రాష్ట్రాలకు మంచి జరగాలి..

తెలుగు ప్రజలు ఎక్కడ వున్నా సంతోషంగా ఉండాలని ఆఖంక్షిస్తున్న..

 అన్నివిధాల శుభం కలుగుతుంది...


బంగారు భవిష్యత్తు తో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది...

Comments