ఉపాధి హామీ పథకం అమలులో ఎన్ జిఒల పాత్ర, భాగస్వామ్యం
తాడేపల్లి (ప్రజా అమరావతి);
పారదర్శకత, ప్రజల భాగస్వామ్యంతో మరింత మెరుగైన ఫలితాలు సాధించాలనే గౌరవ ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈరోజు అనగా 17-1-2025 న చెంచు గూడెంలలో పనిచేస్తున్న వివిధ స్వచ్చంద సంస్థల ప్రతినిధుల (ఎన్ జి ఓ)తో కమిషనర్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఉపాధి హామీ పథకం అమలులో ఎన్ జి ఓల పాత్ర ఎలా ఉండాలి అన్న అంశాలపై సంచాలకులు, ఉపాధి హామీ పథకం వైవికే షణ్ముఖ్ కుమార్, ఐఎఫ్ఎస్ వివరించారు. జీవనోపాధుల మెరుగుదల కోసం ఉపాధి హామీ పథకంలో ఎలాంటి పనులు చేయాలనే అంశాలపై స్వచ్చంద సంస్థల ప్రతినిధులతో చర్చించారు. ఈ సమావేశంలో మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు ఉద్దేశ్యాలు, కూలీల హక్కులు, పథకంలో చేయదగిన పనుల గురించి ఎన్ జి ఓలకు అడిషనల్ కమిషనర్, మల్లెల శివప్రసాద్ అవగాహన కల్పించారు.
జీవనోపాధులను మరింత మెరుగుపరచే వినూత్నమైన కార్యక్రమాలను ఉపాధి హామీ పథకంలో చేయడానికి తగు సూచనలు, సలహాలు అందించాలని, కూలీలకు రోజువారి వేతనం రూ.300/- పొందడానికి, శ్రమశక్తి సంఘాల ఏర్పాటులో అవగాహన పెంపొందించాలని స్వచ్చంద సంస్థల ప్రతినిధులను కోరారు. ఈ కార్యక్రమంలో జె. నీలయ్య, చైర్మన్, అప్పలేట్ అథారిటీ, ఇజిఎస్, ఆర్ డిటి, ఏఆర్ హెడ్స్, అమృత, కోవెల్ ఫౌండేషన్, విఆర్ఓ, హైఫెర్ ఫౌండేషన్, కేవైఆర్ డి, సేట్రీస్, సిడబ్ల్యూఎస్, రెయిన్ ఫారెస్ట్ అలయెన్స్ సంస్థల ప్రతినిధులు, ఇజిఎస్ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment