గుంటూరు, 28 జనవరి 2025 (ప్రజా అమరావతి):
మంగళవారం కలెక్టరేట్ లోని ఎస్ఆర్ శంకరన్ హాలులో జరిగిన జిల్లా సమీక్షా సమావేశంలో జిల్లా ఇన్ చార్జ్ మంత్రి మరియు పర్యాటక, సాంస్కృతిక , సినియాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, పౌర సరఫరాలు , వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ , శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ, జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ, రాజ్యసభ సభ్యులు ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, శాసనమండలి సభ్యులు కె ఎస్ లక్మణరావు, చంద్రగిరి ఏసురత్నం, టి. కల్పలతా రెడ్డి , మురుగుడు హనుమంతరావు, శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు, ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ , తెనాలి శ్రావణ కుమార్, గళ్లా మాధవి, మహమ్మద్ నసీర్ అహ్మద్, సంయుక్త కలెక్టర్ ఏ భార్గవ తేజ, నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహా, అసిస్టెంట్ కలెక్టర్ స్వప్నిల్ పవార్ జగన్నాధ్ జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర పౌర సరఫరాలు , వినియోగదారుల వ్యవహారల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ
సీసీఆర్సీ కార్డులు ఇచ్చిన వారందరికీ రుణాలు మంజూరు చేసేలా నియోజకవర్గంవారీగా డ్రైవ్ చేపట్టాల
న్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా చేసే వారిని ఉక్కుపాదం తో అణచివేసేలా కేసులు నమోదు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసారన్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 1.48 కోట్ల తెల్ల రేషన్ కార్డులు, 1.55 కోట్ల గ్యాస్ కనెక్షన్ లు ఉన్నాయన్నారు. వీటిని అనుసంధానం చేయకపోవడం వల్ల 8 లక్షల గ్యాస్ కనెక్షన్ లు అధికంగా ఉన్నట్లు గుర్తించామన్నారు.. వచ్చే వారంలో గ్రామ, వార్డు సచివాలయాలకు ఈ బాధ్యత అప్పగించి సమస్యను పరిష్కారిస్తామన్నారు.రాష్టంలో 87 లక్షల పై చిలుకు గ్యాస్ సిలిండర్ లు లబ్ధిదారులకు అందించామన్నారు. గుంటూరు జిల్లాలో 3.83 లక్షల ఉచిత గ్యాస్ సిలిండర్ లు పంపిణీ చేశామన్నారు..అంతిమంగా ఎక్కువ మంది వినియోగదారులకు లబ్ధి చేకూర్చాలన్నదే ప్రభుత్వ ధ్యేయం అన్నారు..రేషన్ వాహనాల (MDU) విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వాటినిమరింత సమర్దవంతంగా ఎలా వినియోగించుకోవాలన్న అంశంపై చర్చిస్తామన్నారు.
అనంతరం ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు చేసి జిల్లాను అన్నిరంగాలలో సర్వతోముఖాభివృద్దిగా చేసి అగ్రగామిగా నిలిపేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కలసి పనిచేయాలని జిల్లా ఇన్ చార్జ్ మంత్రి మరియు పర్యాటక, సాంస్కృతిక , సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.
addComments
Post a Comment