*రాష్ట్ర ప్రజలందరికీ వెంకటేశ్వరుని ఆశీస్సులు ఉండాలి
*
*ధనుర్మాస వ్రత మహోత్సవంలో మంత్రి నారా లోకేష్*
అమరావతి (ప్రజా అమరావతి): ధనుర్మాసం శ్రీ వెంకటేశ్వర స్వామి కి ఇష్టమైన మాసం. ఈ ధనుర్మాసం లో స్వామి వారిని పూజించుకున్నా, దర్శించుకున్నా అందరికీ మంచి జరుగుతుందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళగిరి శ్రీశైలనగర్ లోని బాపూజీ విద్యాలయంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహిస్తున్న ధనుర్మాస వృత మహోత్సవంలో లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ... ఇలాంటి నెలలో ధనుర్మాస వ్రతాలు చేసుకోవడం వలన అందరికీ మంచిది. ధనుర్మాసం లో దీక్షలు చేయడం వలన పుణ్యం వస్తుంది. ఇలాంటి గొప్ప కార్యక్రమానికి రావడం నా అదృష్టం. ఈ రూపంలో స్వామి వారి ఆశీస్సులు నాకు కూడా దక్కాయి. ఇటువంటి దైవ కార్యక్రమాలు నిర్వహించడం వలన యువత కు కూడా ఏ నెలలో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవాలో అవగాహన పెరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వలన అందరూ సుఖసంతోషాలతో ఉంటాము. మంగళగిరి లో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం, కొండపైన ఉన్న పానకాల నరసింహ స్వామి, విజయకీలాద్రి క్షేత్రం ఇటువంటి ఆలయాలను ధనుర్మాసంలో దర్శించుకోవడం చాలా మంచిది. ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి గారికి ధన్యవాదాలు. కలియుగ దైవం అయిన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటున్నానని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
addComments
Post a Comment