*నేషనల్ స్కేటింగ్ గోల్డ్ మెడల్ విజేత హశిష్ కు మంత్రి లోకేష్ అభినందనలు...
*
తాడేపల్లి (ప్రజా అమరావతి);
ఉండవల్లిలో ప్రజా దర్బార్లో శనివారం తమిళనాడు పొలాచీలో డిసెంబర్ ఐదు నుంచి 15 వరకు జరిగిన 62వ నేషనల్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్- 2024 పోటీలలో బంగారు పతకం సాధించిన తాడేపల్లి డోలాస్ నగర్ కు చెందిన మెరుగుపాల హశిష్ ను రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ అభినందించారు. హశిష్ భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని, తన సహాయ సహకారాలు ఉంటాయని ఆయన అన్నారు. క్రీడాకారుడు హశిష్ వెంట తల్లిదండ్రులు మెరుగుపాల రాజు, శివ మాధవిలు ఉన్నారు.
addComments
Post a Comment