ఏపీడబ్ల్యుజేఎఫ్ డైరీని ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారధి..

 ఏపీడబ్ల్యుజేఎఫ్ డైరీని ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారధి..


అమరావతి (ప్రజా అమరావతి);

ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యుజేఎఫ్) 2025 మీడియా డైరీని బుధవారం బందరురోడ్డులో గల క్యాంపు కార్యాలయంలో సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి ఆవిష్కరించారు. 


అందరికీ ఉపయోగకరమైన సమాచారంతో క్రమం తప్పకుండా మీడియా డైరీని తీసుకొస్తున్నందుకు ఫెడరేషన్కు అభినందనలు తెలియజేశారు.     


తొలుత ఫెడరేషన్ నాయకులు మంత్రికి పుష్పగుచ్చం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 


కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు, రాష్ట్ర నాయకులు కొండబాబు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కలిమిశ్రీ, ఎం.బి. నాధన్, జిల్లా నాయకులు చొప్పా రాఘవేంద్రశేఖర్ పాల్గొన్నారు.

Comments