*దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డి,తొలి ఒప్పందం
*
హైదరాబాద్: జనవరి 21 (ప్రజా అమరావతి);
తెలంగాణ సర్కార్ దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో మొదటి ఒప్పందం కుదిరిం ది. ప్రముఖ అంతర్జాతీయ సంస్థ అయిన యూనిలివర్ గ్లోబల్‌తో తెలంగాణ సర్కార్ చర్చలు జరిపి ఈ ఒప్పందాన్ని సొంతం చేసుకుంది.
ఇందుకోసం కామారెడ్డిలో పామాయిల్ తయారీ ప్లాంట్‌ను ప్రారంభిం చేందుకు యూనిలివర్ సిద్ధమైంది. అలాగే, బాటిల్ క్యాప్‌ల తయారీ యూనిట్ ఏర్పాటు చేయడానికి కూడా ఆసక్తి చూపించింది. ఈ ఒప్పందాలపై సంబం ధిత సంస్థలు ముందుకు వెళ్లాయి.
తెలంగాణకు పెట్టు బడులు.. యూనిలివర్‌తో మొదటి ఒప్పందం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో 2025 సంవత్స రంలో తెలంగాణకు పెట్టుబడులు ప్రవేశించడం ప్రారంభమైంది.
రేవంత్ రెడ్డి సర్కార్‌తో ప్రముఖ కంపెనీ యూనిలి వర్ తొలి ఒప్పందం కుదు ర్చుకుంది. యూనిలివర్, ప్రపంచవ్యాప్తంగా నిత్యావ సర వస్తువుల తయారీలో ప్రముఖమైన బ్రాండ్. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు యూనిలివర్ సుముఖత వ్యక్తం చేసింది.
ఈ చర్చలు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, రాష్ట్ర అధికారులతో కలిసి నిర్వహించారు. ఇందులో తెలంగాణలో పెట్టుబడు లకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వ మద్దతు వివరించారు.
addComments
Post a Comment