ఈనెల 23న జరిగే ఎపిపిఎస్సి గ్రూపు-2 మెయిన్ పరీక్షకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
175 కేంద్రాల్లో పరీక్షలు-హాజరు కానున్న92,250 మంది అభ్యర్ధులు
ఉ.10గం.ల నుండి మధ్యాహ్నం 12.30 గం.ల వరకు పేపర్-1
మధ్యాహ్నం 3గం.ల నుండి సా.5.30 గం.ల వరకు పేపర్-2
పరీక్షరోజు పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ణలు
సోషల్ మీడియాలో వదంతులు ప్రసారం లేదా సర్కులేట్ చేస్తే కఠిన చర్యలు
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్
అమరావతి,20 ఫిబ్రవరి (ప్రజా అమరావతి):ఈనెల 23వతేదీన నిర్వహించనున్నఎపిపిఎస్సి గ్రూపు-2 మెయిన్ వ్రాత పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయా నంద్ చెప్పారు.ఈపరీక్షల నిర్వహణపై గురువారం రాష్ట్ర్ర సచివాలయంలో ఎపిపిఎస్సి చైర్మన్ ఎ.అనురాధతో కలసి ఆయన అధికారులతో సమీక్షించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షల నిర్వహణలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా అన్ని పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు తోపాటు ఇతర ఏర్పాట్లను చేయాలని కలక్టర్లు,ఎస్పిలను ఆదేశించారు.13 పాత జిల్లా కేంద్రాల్లోని 175 పరీక్షా కేంద్రాల్లో ఈపరీక్షలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.పరీక్షల నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే మార్గదర్శకాలను జిల్లాలకు పంపండం జరిగిందని వాటిని పూర్తిగా పాటించాలని స్పష్టం చేశారు.ఈపరీక్షలకు 92వేల 250 మంది అభ్యర్ధులు హాజరు కానున్నారని పరీక్షలు సజావుగా జరిగేందుకు వీలుగా పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని కలక్టర్లు,ఎస్పిలను ఆదేశించారు.
ముఖ్యంగా పరీక్షల నిర్వహణకు సంబంధించి సోషల్ మీడియాలో ఎక్కడైనా ఎవరైనా వదంతులు లేదా నకిలీ వార్తలు ప్రసారం చేసినా లేదా సర్కులేట్ చేసినా వెంటనే విచారణ చేసి అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఎస్ విజయానంద్ కలక్టర్లు,ఎస్పిలకు స్పష్టం చేశారు.ఇదే సమయంలో ఎవరైనా నకిలీ వార్తలు ప్రసారం లేదా వదంతులు స్పష్టించినా అభ్యర్ధులు వారి తల్లిదండ్రులు ఎవిధమైన ఆందోళన చెందవద్దని ఆయన హితవు చేశారు. పరీక్షలు సజావుగా సక్రమంగా జరిగేందుకు వీలుగా ఇప్పటికే అన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు.సెన్సిటివ్ పరీక్షా కేంద్రాలుగా గుర్తించిన ప్రాంతాల్లో మరిన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సిఎస్ విజయానంద్ కలక్టర్లు,ఎస్పిలు,ఎపిపిఎస్సి అధికారులను ఆదేశించారు.
ముందుగా ఎపిపిఎస్సి చైర్మన్ ఎ.అనురాధ గ్రూపు-2 మెయిన్ పరీక్షల ఏర్పాట్ల గురించి మాట్లాడుతూ పాత 13 జిల్లా కేంద్రాల్లోని 175 పరీక్షా కేంద్రాల్లో ఈపరీక్షలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.23వ తేదీ ఉదయం 10గల.ల నుండి మధ్యాహ్నం 12.30 గం.ల వరకూ పేపర్-1 వ్రాత పరీక్ష ఉంటుందని అభ్యర్ధులు ఉ.9.30 గం.ల లోపు ఆయా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఉ.9.45 గం.లకు పరీక్షా కేంద్రాల గేట్లను మూసివేయాలని ఆలస్యంగా వచ్చిన ఎవరినీ లోనికి అనుమతించ కూడదని స్పష్టం చేశారు.అదే విధంగా మధ్యాహ్నం 3గం.ల నుండి 5.30 గం.ల వరకూ పేపర్-2 పరీక్ష ఉంటుందని అభ్యర్ధులు మధ్యాహ్నం 2.30 గం.ల లోగా ఆయా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని 2.45 గం.లకు ఆపరీక్షా కేంద్రాలా గేట్లను మూసివేసి ఆతర్వాత ఎట్టిపరిస్థితుల్లోను అభ్యర్ధులెవరినీ లోనికి అనుమతించకూడదని ఆమె స్పష్టం చేశారు.పరీక్షల నిర్వహణకు సంబంధించి డిటైల్డ్ ఇనస్ట్రక్సన్లతో కూడిన బుక్ లెట్ ను అన్ని పరీక్షా కేంద్రాలకు పంపడం జరిగిందని ఆసూచనలన్నీ లైజన్ అధికారులు,చీఫ్ సూపరింటిండెంట్లు,ఇన్విజిలేటర్లు తుఛ తప్పక పాటించి పరీక్షలు సజావుగా జరిగేలే చూడాలని చెప్పారు.
గ్రూఫు-2 మెయిన్ పరీక్షలకు సంబంధించి సోషల్ మీడియాలో పరీక్షలు వాయిదా పడతాయని,ఇతర దుష్ప్రచారం జరుగుతోందని అటువంటివేమీ అభ్యర్ధులు నమ్మవద్దని ఎట్టి పరిస్థితుల్లోను ఈనెల 23వ తేదీన ఈపరీక్షలను సజావుగా జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు చైర్మన్ అనురాధ స్పష్టం చేశారు.పరీక్షల సమయంలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలకు అవకాశం లేనివిధంగా తగిన బందోబస్సు ఏర్పాట్లు చేయాలని కలక్టర్లు, ఎస్పిలకు ఆమె సూచించారు.అలాగే పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ణలు విధించాలని చెప్పారు.అదే విధంగా పరీక్షా కేంద్రాల సమీపంలో పరీక్షల సమయంలో జిరాక్సు,నెట్ కేంద్రాలన్ని మూసి ఉంచాలన్నారు.పరీక్ష హాల్లోకి మొబైల్ ఫోన్లను, ఎలక్ట్రానిక్ వాచీలు తదతర పరికరాలను ఎట్టిపరిస్థితుల్లోను లోనికి అనుతించరాదని తెలిపారు. అంతేగాక అవసరమైన మేర పరీక్షా కేంద్రాల్లో సిసిటివి కవరేజ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని చైర్మన్ అనురాధ కలక్టర్లకు సూచించారు.
రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేశ్ కుమార్ మీనా మాట్లాడుతూ పరీక్షల సమయంలో ఎక్కడైనా సోషల్ మీడియా లేదా ఇతర ప్రచార మాధ్యమాల్లో నకిలీ వార్తలు ప్రసారం చేస్తే వెంటనే స్పందించి పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కలక్టర్లకు సూచించారు.అలాంటి వార్తలపై వెంటనే స్పందించి కౌంటర్ చేయడం తోపాటు తప్పుడు లేదా నకిలీ వార్తలు ప్రసారం చేస్తే అలాంటి వారిపై చట్ట పరంగా చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈసమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి కె.శశిధర్,ఆశాఖ కమీషనర్ కృతికా శుక్ల, సమాచారశాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్ల,ఎపిపిఎస్సి కార్యదర్శి ఐఎన్ మూర్తి తదితర అధికారులు పాల్గొనగా వర్చువల్ గా జిల్లా కలక్టర్లు,ఎస్పిలు,సిపిలు,ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment