అమరావతి (ప్రజా అమరావతి);
• *గుంటూరులో బద్వేల్ వైసీపీ నేత హల్ చల్
*-
• *జైలుకు వెళ్లి వచ్చి దాడికి యత్నం*
• *కాపాడాలంటూ బాధితుడు గ్రీవెన్స్ లో ఫిర్యాదు*
• *అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి అనగాని సత్యప్రసాద్, మాజీ మంత్రి పీతల సుజాత*
టీడీపీ కేంద్ర కార్యాలయంలో నేడు నిర్వహించిన అర్జీల స్వీకరణ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, మాజీ మంత్రి పీతల సుజాతలు అర్జీదారుల నుండి వినతులు స్వీకరించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. వైసీపీకి చెందిన బద్వేల్ మున్సిపల్ వైస్ చైర్మన్ యర్రగొల్ల గోపాల స్వామి గుంటూరులో ఉంటున్న తమపై దాడికి యత్నిస్తున్నారని.. తాను వాస్తవానికి బద్వేల్ మండలం ఎల్లుగారిపల్లె గ్రామానికి చెందిన వాడనని.. అక్కడ నుండి వచ్చి గుంటూరులో ఉంటుండగా.. ఓ భూ కేసులో గోపాల స్వామి జైలుకు పోవడంతో దానికి కారణం తానేనని కక్ష పెంచుకుని తమపై దాడి చేసేందుకు రెక్కి నిర్వహిస్తున్నారని.. వారిపై చర్యలు తీసుకొని తమకు ఇబ్బంది లేకుండా చూడాలని మురా రాజన్న గ్రీవెన్స్ లో నేతలకు అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేశాడు. అర్జీల స్వీకరణ అనంతరం రెవెన్యూ శాఖా మంత్రి అనగాని మాట్లాడుతూ.. వస్తున్న అర్జీల్లో ఎక్కువ భాగం కుటుంబ సభ్యల మధ్య తగాధాలే ఉన్నాయని.. కోర్టుల్లో తేల్చుకోవాల్సిన అర్జీలు ఉన్నాయని. వాటి కోసం గ్రీవెన్స్ లో ప్రత్యేకంగా లాయర్ ను కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు.
• పల్నాడు జిల్లా దుర్గి మండలానికి చెందిన షేక్ షైనా విజ్ఞప్తి చేస్తూ.. తమ భూమిని తమకు తెలియకుండా నరసరావు పేటలో దార్ల వీరభద్రాచారి, అన్నపురెడ్డి వెంకటరెడ్డి తదితరులు అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని.. దీనిపై విచారించి తమకు న్యాయం చేయాలని ఆమె గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేశారు.
• అన్నమయ్య జిల్లా గాలివీడు మండలానికి చెందిన ఎమ్. శ్రీనివాస రాజు విజ్ఞప్తి చేస్తూ.. తన భూమిని రౌడీ షీటర్ లాక్కుని అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని.. ఈ అక్రమ రిజిస్ట్రేషన్ పై విచారించి తనకు న్యాయం చేయాలని కోరాడు.
• శ్రీ సత్యాసాయి జిల్లా గంటాపురం గ్రామానికి చెందిన ఎమ్. వెంకటేష్ విజ్ఞప్తి చేస్తూ.. తనను మోసగించి సంతకం చేయించుకుని చిట్రా శివయ్య అనే వ్యక్తి తన భూమిని కొట్టేశాడని.. అతని నుండి తనకు రావాల్సిన భూమిని ఇప్పించవలసిందిగా అభ్యర్థించాడు.
• కడప జిల్లా కడపకు చెందిన పెంచలయ్య విజ్ఞప్తి చేస్తూ.. తాను సైబర్ క్రైమ్ వలన రూ. 800,000 లక్షలు పోగొట్టుకున్నానని.. దానిపై ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు తీసుకోవడంలేదని.. దయ చేసి కేసు తీసుకొని సైబర్ మోసగాళ్లపై చర్యలు తీసుకునేలా చూడాలని గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి అభ్యర్థించాడు.
• తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి గ్రామానికి చెందిన కె. ధనుంజయరావు విజ్ఞప్తి చేస్తూ.. గ్రామంలో తాము ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూమికి పట్టాలు మంజూరు అయినా.. అడంగల్ నందు ఇనామి భూమిగా ఉందని.. దయ చేసి ఇనామ్ భూమి నుండి రైతువారి పట్టా భూమిగా వెబ్ పోర్టల్ లో మార్చాలని ఆయన విజ్ఞప్తి చేశాడు.
• ఏలూరు జిల్లా ఏలూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ఫణీకుమార్ విజ్ఞప్తి చేస్తూ.. తాను సివిల్ ఇంజనీరింగ్ చదువుకున్నానని పాత గవర్నమెంట్ రెండు సవంత్సరాలు ఫీజు రియంబర్స్ మెంట్ ఇచ్చి మిగిలిన రెండేళ్లు ఇవ్వకపోవడంతో సర్టిఫికేట్లు కాలేజీలో ఉండిపోయాయని దయ చేసి పెండింగ్ ఫీజు చెల్లించి సర్టిఫికేట్లు ఇచ్చేలా చూడాలని గ్రీవెన్స్ అర్జీ ఇచ్చి నేతలను అభ్యర్థించాడు.
• తమ ఆధీనంలో ఉండి అనుభవంలో ఉన్న పొలాన్ని చిలమత్తూరు రిజిస్ట్రర్ కార్యాలయలో సంబంధం లేని.. ఎటువంటి దస్తావేజులు లేని వ్యక్తులకు అక్రమ రిజిస్ట్రేషన్ చేశారని.. దీనిపై విచారించి అక్రమ రిజిస్ట్రేషన్ ను రద్దు చేయాలని ఎన్. శ్రీధర్ విజ్ఞప్తి చేశారు.
addComments
Post a Comment