విజయవాడ (ప్రజా అమరావతి);
ఆర్టీసీ హౌస్ లో “ స్వచ్చ ఆంధ్ర ప్రతిజ్ఞ ” నిర్వహణ
“స్వర్ణాంధ్ర - స్వచ్చ ఆంధ్ర” నినాదంతో పరిశుభ్ర ఆంధ్ర ప్రదేశ్ సాధించే దిశలో భాగంగా అన్ని ప్రభుత్వ విభాగాలలోనూ పరిశుభ్రతపై అవగాహన కల్పించే చర్యలలో భాగంగా ఈ రోజు అనగా 14.02.2025 తేదీ సాయంత్రం 4 గంటలకు ఏ.పి.ఎస్.ఆర్.టి.సి ప్రధాన కార్యాలయం ఆర్టీసీ హౌస్ నందు అధికారులు, సూపర్వైజర్లు, ఉద్యోగులు సమావేశమై “స్వఛ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ” చేసి పరిశుభ్రత కొరకు కృషి చేస్తామని ప్రమాణం చేశారు. డిప్యూటీ ఛీఫ్ పర్సనల్ మేనేజర్ (హెచ్.ఆర్.డీ & డబ్ల్యూ) కుమారి డి. సాంబ్రాజ్యం ఈ ప్రతిజ్ఞ చేయించారు.
సంస్థ లోని వివిధ కార్యాలయాలు, బస్సులు, బస్సు స్టేషన్లు మరియు పరిసరాలను శుభ్రంగా ఉంచడం ద్వారా ఉద్యోగులు పరిశుభ్రత పాటించడంపై దృష్టి నిలిపేలా ఈ ప్రతిజ్ఞ రూపొందించబడినది.
ఈ స్వచ్చ ఆంధ్ర కార్యక్రమాలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సంస్థ లోని అన్ని డిపోలలోను స్వచ్చ ఆంధ్ర ప్రతిజ్ఞ నిర్వహించడం జరుగుతుంది. అలాగే సంస్థ కార్యాలయాలు, బస్సులు, బస్సు స్టేషన్లలో పరిశుభ్రత పాటించడం మీద అవగాహన కల్పిస్తూ తగు చర్యలు చేపట్టనున్నారు.
ఈ కార్యక్రమంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఏ) శ్రీ జి.వి.రవివర్మ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆపరేషన్స్) శ్రీ ఏ.అప్పలరాజు, ఏ.డి (వి అండ్ ఎస్) శోభా మంజరి ఇంకా విభాగాధిపతులు, అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది తదితరులు హాజరయ్యారు.
addComments
Post a Comment