ప్రతిష్ఠాత్మక స్కోచ్ గోల్డ్ అవార్డు గెలుచుకున్న ఏపీ సైనిక్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్.




*ప్రతిష్ఠాత్మక స్కోచ్ గోల్డ్ అవార్డు గెలుచుకున్న ఏపీ సైనిక్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్*



*ఢిల్లీ లో స్కోచ్ గోల్డ్ అవార్డు అందుకున్న సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ బ్రిగేడియర్ వి. వెంకట్ రెడ్డి*


*మొట్టమొదటి సారిగా ప్రతిష్టాత్మక స్కోచ్ గోల్డ్ అవార్డు ను గెలుచుకున్న ఏపీ సైనిక్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్*


*ఈ సంవత్సరం అన్ని రాష్ట్రాలను వెనక్కు నెట్టి స్కోచ్ గోల్డ్ అవార్డును సొంతం చేసుకున్న ఏకైక ఏపీ సైనిక్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్*


*ఏపీ సైనిక్ వెల్ఫేర్ అధికారులను అభినందించిన కేంద్రీయ సైనిక్ బోర్డ్, రాష్ట్ర హోమ్ మంత్రి శ్రీమతి వంగల పూడి అనిత , హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజీత్*


*సోమవారం నాడు విజయవాడ సైనిక్ వెల్ఫేర్ రాష్ట్ర డైరెక్టర్ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది తో కలిసి స్కోచ్ గోల్డ్ అవార్డు గెలుపు ఆనందాన్ని పంచుకున్న డైరెక్టర్ బ్రిగేడియర్ వెంకట్ రెడ్డి*


విజయవాడ/అమరావతి, ఫిబ్రవరి 17 (ప్రజా అమరావతి): ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సైనిక సంక్షేమ శాఖ ప్రతిష్ఠాత్మక స్కోచ్ గోల్డ్ అవార్డు ను గెలుచుకుంది. ఇండియా లో ఏ రాష్ట్ర సైనిక్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కు దక్కని గౌరవం మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర 

సైనిక్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్వంతం చేసుకుంది. 


స్కోచ్ అవార్డు కమిటీ ఆహ్వానం మేరకు ఏపీ సైనిక సంక్షేమ శాఖ డైరెక్టర్ బ్రిగేడియర్ వెంకట్ రెడ్డి శనివారం నాడు న్యూ ఢిల్లీ ఇండియా హాబిటేట్ సెంటర్ లో స్కోచ్ అవార్డు కమిటీ చైర్మన్ సమీర్ కొచ్చర్ ద్వారా ప్రతిష్ఠాత్మక స్కోచ్ గోల్డ్ అవార్డును అందుకున్నారు. 


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సైనిక సంక్షేమ శాఖలో మాజీ సైనికులు, యుద్ధ వీరుల వీర మాతలు, వీర నారీలు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమం, ఉపాధి, పునరావాసం , ఈ-గవర్నెన్స్, పబ్లిక్ గ్రీవెన్స్ ను త్వరిత గతిన పరిష్కరించడం, ఇన్నోవేటివ్ ఇనీషియేటివ్స్ తదితర అంశాల్లో స్కోచ్ గోల్డ్ అవార్డు జ్యూరీ కమిటీ అవార్డు కోసం పోటీ పడిన అన్ని రాష్ట్రాల సైనిక సంక్షేమ శాఖ ల పనితీరును సునిశిత పరిశీలన చేసి ప్రతిష్ఠాత్మక స్కోచ్ గోల్డ్ అవార్డును మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సైనిక సంక్షేమ శాఖ కు అందించారు. 


స్కోచ్ గోల్డ్ అవార్డు ను గెలుచుకున్న ఏపీ సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ బ్రిగేడియర్ వెంకట్ రెడ్డి, అధికారులను  రాష్ట్ర హోమ్ మరియు సైనిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత , కేంద్ర ప్రభుత్వ మాజీ సైనికుల సంక్షేమ శాఖ కార్యదర్శి డా. నితెన్ చంద్ర , కేంద్రీయ సైనిక్ బోర్డ్ సెక్రటరీ బ్రిగేడియర్ డి ఎస్ బసేరా, రాష్ట్ర హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజీత్ అభినందించారు. 


అలాగే, సోమవారం నాడు విజయవాడ మొగల్రాజపురం లో ఉన్న రాష్ట్ర సైనిక్ వెల్ఫేర్  డైరెక్టర్ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది తో కలిసి స్కోచ్ గోల్డ్ అవార్డు గెలుపు ఆనందాన్ని డైరెక్టర్ బ్రిగేడియర్ వెంకట్ రెడ్డి పంచుకుంటూ ప్రతిష్ఠాత్మక స్కోచ్ గోల్డ్ అవార్డు ను గెలుచుకోవడం మన రాష్ట్ర సైనిక సంక్షేమ శాఖ కు ఎంతో గర్వకారణం అని , దేశ రక్షణ సేవ చేసిన మాజీ సైనికులు వారి కుటుంబ సభ్యుల సంక్షేమం , ఉపాధి, పునరావాసం కోసం ప్రత్యేకంగా ఆంధ్ర ప్రదేశ్ మాజీ సైనికుల కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి కార్పస్ ఫండ్ గా రూ 10 కోట్లు ప్రకటించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్, హెచ్ ఆర్ డీ మినిస్టర్ శ్రీ నారా లోకేష్, హోమ్ మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత , హోమ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కుమార్ విశ్వజీత్ ఎంతో కృషి చేస్తున్నారని వారికి సైనిక సంక్షేమ శాఖ , మాజీ సైనికుల తరఫున డైరెక్టర్ బ్రిగేడియర్ వి. వెంకట్ రెడ్డి కృతజ్ఞతలను తెలిపారు. అలాగే అవార్డు కోసం కృషి చేసిన అధికారులను, సిబ్బందిని డైరెక్టర్ అభినందించారు. అదేవిధంగా , అధికారులు , సిబ్బంది డైరెక్టర్ కు పుష్పగుచ్ఛం అందజేసి, కేక్ కట్ చేసి అభినందనలు తెలియజేశారు. 


ఈ కార్యక్రమంలో డైరెక్టరేట్ కార్యాలయ సహాయ సంచాలకులు కెప్టెన్ డా. సత్యప్రసాద్, అధికారులు బాలాజీ, భక్తవత్సల రెడ్డి, అనంతపురం ఉమ్మడి జిల్లా సైనిక సంక్షేమ అధికారి మరియు డిప్యూటీ డైరెక్టర్ పి. తిమ్మప్ప, అధికారులు శిఖామణి, భాను ప్రకాష్ , సిబ్బంది పాల్గొన్నారు.


Comments