*మున్నంగి గ్రామంలో రైతులకు అవగాహన కార్యక్రమం
*
కొల్లిపర (ప్రజా అమరావతి);
25-02-2025న భారత ప్రభుత్వ ప్రజా రంగ సంస్థ అయిన మద్రాస్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ వారు వ్యవసాయ శాఖ వారి సౌజన్యంతో కొల్లిపర మండలంలోని మున్నంగి గ్రామంలో PM PRANAM కార్యక్రమం క్రింద రైతులకు సేంద్రియ ఎరువుల వాడకం పై అవగాహన కల్పించారు.
ఇందులో భాగంగా రైతులకు సేంద్రియ వ్యవసాయం మీద క్షేత్ర ప్రదర్శన ఏర్పాటు చేసి రైతు సేవా కేంద్రంలో రైతులకు పూర్తిగా సేంద్రియ ఎరువుల వాడకం మీద అవగాహన కల్పించారు. అలాగే రైతులకు సేంద్రియ ఎరువుల పరిజ్ఞానంపై క్విజ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి విజేతలకు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమం లో తెనాలి డివిజన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ శ్రీమతి N.ఉషారాణి , మరియు MAO శ్రీ వెంకట రావు , మద్రాస్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ చీఫ్ మేనేజర్ శ్రీ ఉమా శంకర్ , మరియు మేనేజర్ శ్రీ ఎస్ చంద్రశేఖర్ మరియు మున్నంగి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
addComments
Post a Comment