ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా.

  ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా



ఢిల్లీ. (ప్రజా అమరావతి );ముఖ్యమంత్రి ఎవరు అనే ఉత్కంఠకు తెరపడింది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా jరేఖాగుప్తా పేరును ఖరారు చేసింది బీజేపీ అధినాయకత్వం. ఆయన రేపు సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు రామ్‌లీలా మైదానంలో భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 


కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఫిబ్రవరి 20 (గురువారం) మధ్యాహ్నం 12:30 గంటలకు దేశ రాజధానిలోని రాంలీలా మైదానంలో జరగనుంది. ఫిబ్రవరి 5న జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)ని ఓడించి 26 సంవత్సరాల తర్వాత బిజెపి అధికారంలోకి వచ్చింది. 


గురువారం మధ్యాహ్నం రాంలీలా మైదానంలో కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారోత్సవానికి సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆయన మంత్రివర్గ సహచరులు, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సహా ఇతర ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా ఇతర అతిథులు హాజరుకానున్నారు. దాదాపు 50,000 మంది ఈ వేడుకకు వస్తారని ఏర్పాట్లు చేస్తున్నారు. 


Comments