రాష్ట్రం కోసం చంద్రబాబు పడుతున్న కష్టంతో పోలిస్తే, పదవులు...పనుల అసంతృప్తి చాలా చిన్నది : మాజీమంత్రి ప్రత్తిపాటి.

 *రాష్ట్రం కోసం చంద్రబాబు పడుతున్న కష్టంతో పోలిస్తే, పదవులు...పనుల అసంతృప్తి చాలా చిన్నది  : మాజీమంత్రి ప్రత్తిపాటి


.*


- పట్టభద్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి ఎంపిక మంచి నిర్ణయం, ఆయన అనుభవం మండలికే వన్నెతెస్తుంది : పుల్లారావు.


- నియోజకవర్గంలో ఒక్క ఓటు కూడా చేజారిపోకుండా,  బూత్ ఇన్ ఛార్జ్ లు బాధ్యతతో పనిచేయాలి : పుల్లారావు.


- ప్రత్తిపాటి మంచి సౌమ్యుడు, తానొవ్వక.. ఇతరులను నొప్పింపక అన్నట్టు వ్యవహరిస్తాడు : ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 

  అమరావతి (ప్రజా అమరావతి);

మాజీమంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ యువజన నాయకుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి, అంచెలంచెలుగా ఎదిగారని, ఈ నెల 27న జరిగే ఎన్నికలో మొదటిప్రాధాన్యత ఓటు వేసి, ఆయన్ని భారీ మెజారిటీతో గెలిపించాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పిలుపునిచ్చారు. ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి ఎంపికపై రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయని, ఆయన అనుభవం మండలికే వన్నెతెస్తుందన్నారు. 

మంగళవారం పట్టణంలో జరిగిన నియోజకవర్గ పట్టభద్రుల ఆత్మీయసమావేశంలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు, చైర్మన్ దినేష్ రెడ్డి తో కలిసి మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కూటమిప్రభుత్వం అధికారంలో ఉన్నందునే రాష్ట్రప్రజలు, మనం  నిర్భయంగా, ప్రశాంతంగా జీవిస్తున్నామనేది కాదనలేని వాస్తవమన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాకుంటే పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి ఊహించుకోవాలన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా గతంలో వివిధ అభివృద్ధి పనులు చేసిన నాయకులు ఓర్పుతో ఉండాలన్నారు. రాత్రికి రాత్రే అద్భుతాలు జరగవని, పార్టీని, ప్రజల్ని నమ్ముకున్నవారికి ప్రభుత్వం కచ్చితంగా న్యాయం చేస్తుందన్నారు. వైసీపీప్రభుత్వంలా దుర్మార్గ రాజకీయాలు కూటమిప్రభుత్వం చేయదన్నారు. పదవులు, పనులు దక్కలేదని మథనపడకుండా, ప్రభుత్వ ఆలోచనలకు తగినట్టు నడుచుకుంటే ఎప్పటికైనా తప్పకుండా న్యాయం జరుగుతుందని ప్రత్తిపాటి స్పష్టంచేశారు. జగన్ దుర్మార్గం, విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కాపాడి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు చంద్రబాబు విరామం లేకుండా పనిచేస్తున్నారని పుల్లారావు తెలిపారు. కేంద్రంలో రాష్ట్రం కీలకం కాబట్టే, చంద్రబాబు.. పవన్ కల్యాణ్ ల చొరవతో నిధులు వస్తున్నాయన్నారు. కూటమిపార్టీల నాయకులతో సమన్వయం చేసుకుంటూ,  చిలకలూరి పేట నియోజకవర్గ అభివృద్ధే  తొలిప్రాధాన్యతగా ముందుకు వెళ్తున్నట్టు పుల్లారావు తెలిపారు. శివరాత్రి మరుసటి రోజు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలో మన నియోజకవర్గంలోనే అత్యధిక ఓట్లు ఆలపాటికి పోలయ్యేలా బూత్, క్లస్టర్ ఇన్ ఛార్జ్ లు బాధ్యతతో పనిచేయాలి. 30 మంది ఓటర్లకు ఒకరిని నియమించామని, వారంతా ఇంచార్జ్ లతో సమన్వయం చేసుకోవాలన్నారు.

కూటమిపార్టీల్లో అభిప్రాయబేధాలు లేనేలేవని,  ఎక్కడా ఏ ఊరిలో కూడా చిన్నసమస్య లేకుండా అందరూ ఐక్యంగా పనిచేసి, రాజేంద్రప్రసాద్ కు భారీమెజారిటీ దక్కేలా చూడాలని పుల్లారావు స్పష్టం చేశారు. నిరుద్యోగ యువత కేంద్రప్రభుత్వ పథకాలు, సబ్సిడీలను సద్వినియోగం చేసుకొని పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని ఆయన సూచించారు. 


*ప్రత్తిపాటి మంచి సౌమ్యుడు, తానొవ్వక.. ఇతరులను నొప్పింపక అన్నట్టు వ్యవహరిస్తాడు : ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్*


ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు చరిత్రాత్మక తీర్పునిచ్చారని, వారి విశ్వాసం, నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కూటమిప్రభుత్వం పనిచేస్తోందని రాజేంద్రప్రసాద్ తెలిపారు. దేశంలోనే అపార  అనుభవమున్న నాయకుడు, పరిపాలనాదక్షుడిగా చంద్రబాబుకి గొప్ప పేరుందని,  పరిపాలనలో కీలకసంస్కరణలు అమలుచేస్తున్నారని ఆలపాటి కొనియాడారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధి పనులకు రూ.10 లక్షల గ్రాంట్ రావడమే గొప్పని, అలాంటిది రూ.1000 కోట్లతో చిలకలూరిపేట బైపాస్ నిర్మాణం చేయడం ప్రత్తిపాటికే సాధ్యమైందన్నారు. పుల్లారావు  పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు దమ్ము, ధైర్యం ఉన్న వారందరినీ ప్రోత్సహించి, పార్టీకి నూతనోత్తేజాన్ని  ఇచ్చారని ఆలపాటి తెలిపారు. పుల్లారావు మంచి సౌమ్యుడని, తానొవ్వక..ఇతరులను నొప్పింపక అన్నట్టు వ్యవహరిస్తాడన్నారు. గతంలో పనులుచేసి నేటికి బిల్లులు క్లియర్ కాని పార్టీ నాయకులు ఎవరూ అధైర్యపడాల్సిన పనిలేదని, ప్రతిపైసా వచ్చేలా చూస్తామని ఆలపాటి హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిఒక్క ఓటు అవసరం అని పార్టీ నాయకులు, కార్యకర్తలు గెలుపుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో జనసేన ఇంచార్జి తోట రాజా రమేష్, బీజేపీ ఇంచార్జి జయరామి రెడ్డి, మూడు పార్టీల రాష్ట్ర, జిల్లా నాయకులు, క్లష్టర్ లు, యూనిట్ ఇంచార్జి లు, బుత్ ఇంచార్జి లు, వార్డు నాయకులు కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Comments