*ఎబిడిఎంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ఇద్దరు రాష్ట్ర వైద్యులకు కేంద్రం సత్కారం
*
అమరావతి (ప్రజా అమరావతి): కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఎబిడిఎం)కార్యక్రమం అమలులో అత్యుత్తమ పనితీరు కనబర్చినందుకు గాను రాష్ట్రానికి చెందిన ఇద్దరు ప్రైవేట్ వైద్యుల్ని జాతీయ ఆరోగ్య అథారిటీ(NHA), న్యూఢిల్లీ జూమ్ కాన్ఫరెన్స్ లో సత్కరించిందని ఎబిడిఎం రాష్ట్ర నోడల్ ఆఫీసర్ బివి రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఎబిడిఎం అమలులో అత్యుత్తమ పనితీరు కనబర్చిన దేశంలోని 50 మంది ఆరోగ్య సంరక్షణ నిపుణులలో గుంటూరులోని శ్రీ కృష్ణ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ శ్రీనివాస్ మరియు గుంతకల్‌లోని సుమంత్ ఆర్థోపెడిక్ సెంటర్‌కు చెందిన డాక్టర్ శ్రీకాంత్ వున్నారని ఆయన తెలిపారు. వారు ఎబిడిఎంను ముందుగా స్వీకరించి అమలు చేయడంతో పాటు అభా (ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్) లింక్డ్ హెల్త్ రికార్డులను రూపొందించడంలో వారి గణనీయమైన కృషికి ఈ సత్కారం లభించిందని ఆయన వివరించారు.
భారతదేశం యొక్క ఇంటిగ్రేటెడ్ డిజిటల్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు అవసరమైన సహకారాన్ని అందించడం ఎబిడిఎం లక్ష్యం. అభా- లింక్డ్ హెల్త్ రికార్డ్‌లను రూపొందించడం ద్వారా, ఈ వైద్యులు రోగులకు వారి ఆరోగ్య సమాచారంపై నియంత్రణను ఇచ్చే డిజిటల్ పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయడంలో సహాయపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో వైద్య నిపుణులు రోగి సమ్మతితో కచ్చితమైన వైద్య చరిత్రలను యాక్సెస్ చేయడానికి వీరు వీలు కల్పిస్తున్నారన్నారు.
అభాలను రూపొందించినందుకు ప్రభుత్వ మరియు ప్రైవేట్ హెల్త్ కేర్ సౌకర్యాలకు
కేంద్ర ప్రభుత్వం
ప్రోత్సాహకాలను అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని రెండు ప్రైవేట్ హెల్త్ ఫెసిలిటీలకు కేంద్ర ప్రభుత్వ సత్కారం లభించడం విశేషం. నేషనల్ హెల్త్ అథారిటీ ఎండి, అదనపు సిఇఓ
వాస్కా కిరణ్ గోపాల్ రెండు ఆసుపత్రుల వైద్య నిపుణులను జూమ్ కాన్ఫరెన్స్ లో సత్కరించారని బివిరావ్ పేర్కొన్నారు.
addComments
Post a Comment