మోసపూరిత ప్రకటనలను చూసి నిరుద్యోగులు ఎవరూ మోసపోవదు.

   

     తాడేపల్లి (ప్రజా అమరావతి);

  నేషనల్ రూరల్ డెవలప్మెంట్ అండ్ రిక్రియేషన్ మిషన్ పేరిట నిన్న ఓ ప్రముఖ దినపత్రికలో ఉద్యోగాల భర్తీకి ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలని ఒక ప్రకటన వెలువడింది. దీనికి సంబంధించి నిరుద్యోగులు అందరిని అప్రమత్తం చేస్తూ రాష్ట్ర  గ్రామీణాభివృద్ధి  శాఖ ఈ వార్తను వెలువరిస్తోంది.


నేషనల్ రూరల్ డెవలప్మెంట్ అండ్ రిక్రియేషన్ మిషన్ మినీస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్  పేరిట ఆంధ్ర ప్రదేశ్ లో  నిరుద్యోగుల నుంచి దాదాపు 6881 ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్లు గా ఆ ప్రకటనలో తెలియచేశారు. ప్రతి  దరఖాస్తుకు 399 రూపాయలు చెల్లించాలని కూడా ఈ ప్రకటనలో పేర్కొన్నారు. నిరుద్యోగులైన యువతను ఆకర్షించడానికి మాత్రమే ఇది జారీ చేశారు కానీ మాకున్న సమాచారం మేరకు అలాంటి సంస్థ గాని అలాంటి విభాగం కానీ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖలో లేదని, ఇది నిరుద్యోగులకు టోకరా వేసే సంస్థని మీ అందరికీ తెలియ చేస్తున్నాం. ఇలాంటి మోసపూరిత ప్రకటనలను చూసి నిరుద్యోగులు ఎవరూ మోసపోవద్దని తెలియజేస్తున్నాం.  కనుక ఇలాంటి ప్రకటనల  పట్ల అప్రమత్తంగా ఉండి నిర్ణయాలు తీసుకుంటారని తెలియజేస్తున్నాం.

Comments