'మహా శివరాత్రి ప్రత్యేక పూజలు, రధోత్సవం.
విజయవాడ (ప్రజా అమరావతి);
ఇంద్రకీలాద్రి పై శ్రీ క్రోధి నామ సంవత్సర మహాశివరాత్రి ఉత్సవములను పురస్కరించుకొని నాల్గవ రోజున ( 27.02.2025)
శ్రీ మల్లేశ్వరస్వామి ఆలయంలో
ఉదయం 8 గంటలనుండి మంటపపూజ, మూల మంత్రహవనములు, హారతి, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వినియోగం కార్యక్రమములు జరిగాయి.ఉదయం 9 గంటల నుండి సదస్యం జరుగగా,
సాయంత్రం 4 గంటల నుండి మండపారాధన, కళశారాధన,మూల మంత్రహవనములు,బలిహరణ,హారతి, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వినియోగం నిర్వహించారు.
సాయంత్రం 4.30 లకు ప్రత్యేక పూజలు అనంతరం ఆది దంపతులు అధిరోహించిన పల్లకీని మంగళ వాయిధ్యాలు, వేద మంత్రాలు నడుమ ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ కె. రామచంద్ర మోహన్ వారి సమక్షంలో మల్లేశ్వరస్వామి ఆలయం నుండి దిగువకు తీసుకొచ్చారు.
విజయవాడ వన్ టౌన్ పాత శివాలయం నుండి మూడు దేవాలయాల దేవతా మూర్తులు ఊరేగింపుగా కెనాల్ రోడ్ రధం వద్దకు చేరి, రధం అధిష్టించి, భక్తుల జయ జయ ద్వానాల మధ్య ముందుకు సాగారు.
addComments
Post a Comment